Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HCU:కూలిన నిర్మాణంలో ఉన్న భవనం, పలువురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) క్యాంపస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. హెచ్‌సీయూలో నిర్మాణంలో ఉన్న కొత్త అడ్మినిస్ట్రేటివ్ భవనం బాల్కనీ గురువారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే బాల్కనీ కుప్పకూలింది.

ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న కొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన యూనివర్సిటీ సిబ్బంది, ఇతర కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి బయటికి తీసి సమీపంలోని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Under-construction building collapses at HCU Several workers seriously injured

సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవన శిథిలా కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, భవన నిర్మాణ పనుల్లో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరుపుతామని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ ఇపాస్ స్కాలర్ షిప్స్ మంజూరు చేయాలంటూ గురువారం మధ్యాహ్నం హెచ్‌సీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. హెచ్‌సీయూ గేట్ ముందు విద్యార్థులు నిరసన చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేట్లను తోసుకుంటూ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లాురు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో హెచ్ సీయూ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+