తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దుండగుల దాడి, విధ్వంసం: వారిపనేనంటూ ఆరోపణ
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దుండుగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
హైదరాబాద్: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దుండుగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్న(చింతపడు నవీన్)కు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం మధ్యాహ్నం దాదాపు 20 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఆదివారం కావడంతో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం కార్యాలయ సిబ్బంది, మల్లన్న అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న(teenmar mallanna).

మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీం ఆరోపించింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈరోజు Q న్యూస్ ఆఫీసులో దుండగులు దాడి.
— kotra shiva NTR 9999 (@KotraNgkl) March 19, 2023
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే రేపు ప్రజల మీద కూడా దాడులు చేస్తారు..@TeenmarMallanna @revanth_anumula @seethakkaMLA @GabbiRajashekar @ThirmandhasT pic.twitter.com/CoXETUWEMe
నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని ఆయన చెప్పారు.
పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. నాలుగుసార్లు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినా.. వార్తలు ఆగలేదన్నారు. ఆఫీసు ఖాళీ చేయించాలని తమ ఆపీసు యజమానిని పోలీసులు బెదిరిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications