హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కు బిగ్ షాకిచ్చిన బడ్జెట్!

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పైన తెలంగాణ ప్రభుత్వం బోలెడు ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్ ప్రాజెక్టును కేంద్ర అనుమతితో త్వరితగతిన ప్రారంభించాలని భావించింది. అయితే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ఇప్పట్లో లేనట్టేనా అన్న నిరాశ కనిపిస్తుంది.

హైదరాబాద్ మెట్రో కీలక రవాణా వ్యవస్థ
హైదరాబాద్లో మెట్రో ప్రజా రవాణాలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాదాపు హైదరాబాద్ నగరంలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ పనుల నిమిత్తం మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎల్బీనగర్ - మియాపూర్, జేబీఎస్ - ఎంజీబీఎస్, నాగోల్ - రాయదుర్గం మూడు కారిడార్లలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది. ఇక 30కి పైగా మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

Union Budget shocks Hyderabad Metro Rail project

కేంద్రానికి మెట్రో విస్తరణకు తెలంగాణా డీపీఆర్
హైదరాబాద్ నగరం విస్తరణ దృష్ట్యా మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా కొత్తగా ఐదు కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం డీపీఆర్ కూడా సిద్ధం చేసి కేంద్రానికి ఆమోదం కోసం పంపించారు. అయితే తాజాగా కేంద్ర బడ్జెట్లో మెట్రో కేటాయింపులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ పైన నీలి నీడలు కమ్ముకున్నాయి.

హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రత్యేక కేటాయింపులు నిల్
దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులకు కేవలం 31 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేకంగా నిధులు అడిగినప్పటికీ బడ్జెట్లో ఎక్కడ ప్రత్యేకంగా ప్రస్తావన జరగలేదు. కేవలం హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు 24 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినా, కేంద్రం దేశవ్యాప్తంగా మెట్రోకు 31 వేల కోట్లు కేటాయించడం గమనార్హం.

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ఇప్పట్లో లేనట్టేనా?
అయితే దేశం మొత్తానికి కేటాయించిన 31 వేల కోట్ల రూపాయల నిధులలో హైదరాబాద్ మెట్రో కు ఎంత మేరకు నిధులు దక్కుతాయి అన్న ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో కు నిరాశ మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+