వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిర్చి ధర: తెలంగాణపై కేంద్రం ‘సవతి’ ప్రేమ, అమిత్ షా వ్యూహం ఫలించేనా?

అన్నదాతల పాలిట కల్పతరువు వంటి మిర్చి పంట కొనుగోళ్లపై కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ మాత్రమే కనబరుస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అన్నదాతల పాలిట కల్పతరువు వంటి మిర్చి పంట కొనుగోళ్లపై కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ మాత్రమే కనబరుస్తున్నాయి. గతేడాది రూ. 12,500 నుంచి రూ.15 వేల వరకు క్వింటాల్ మిర్చి ధర పలికింది. కానీ దళారుల పుణ్యమా? అని కేవలం రూ.2,500 నుంచి రూ.5000 లోపే పలుకుతున్నారు.

చివరి క్షణం వరకూ.. అదీ రైతాంగం కడుపు మండి ఆందోళనకు దిగిన తర్వాత దాదాపు పంట విక్రయాలు పూర్తయిన తర్వాత క్వింటాల్ మిర్చిని రూ.5000లకు కొనుగోలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సెలవిచ్చారు.

అదీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కేవలం 33,700 టన్నుల మిర్చి మాత్రమే కొనుగోలు చేయాలని కూడా పరిమితులు విధించింది. దళారులు కొనుగోలు చేస్తున్న ధరనే కనీస మద్దతు ధరగా ప్రకటిస్తే రైతులకు గిట్టుబాటేమిటన్న ప్రశ్న కూడా రైతులలో ఉదయిస్తోంది.

దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ మిర్చికి రూ.7000 ప్రకటిస్తే సబబుగా ఉంటుందని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇదిలా ఉంటే రైతుల వద్ద ఇంకా 30 లక్షల టన్నుల మిర్చి నిల్వలు ఉన్నాయని తెలంగాణ మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నది.

ఈ నెలాఖరు వరకే కొనుగోళ్లకు పరిమితి

ఈ నెలాఖరు వరకే కొనుగోళ్లకు పరిమితి

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88,300 టన్నుల మిర్చి కొనుగోళ్లకు అనుమతినిచ్చింది. ఈ పరిమితుల్లో కొనుగోళ్లలో నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుందని.. ఈ నెల రెండో తేదీ నుంచి 31 వరకు మాత్రమే కొనుగోళ్లు జరుపాలని మరో షరతు విధించడం పట్ల తెలంగాణలో నిరసన వ్యక్తమవుతున్నది. మిర్చి రైతుల సంక్షేమం పట్ల నామమాత్రపు మద్దతు ధర ప్రకటించి చేతులు దులిపేసుకున్నదన్న విమర్శలు ఉన్నాయి.

బోనస్‌పై కేసీఆర్ నిర్ణయం నేడే

బోనస్‌పై కేసీఆర్ నిర్ణయం నేడే

పేరుకు మద్దతు ధర ప్రకటించి.. దీనివల్ల ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు అర్థమేమిటో అర్థం కావడం లేదని చెప్తున్నారు.ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటుందా? లేదా? అన్న విషయం ప్రశ్నార్థకంగానే ఉన్నది. దీనిపై గురువారం సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నది
ఇప్పటికే రైతులు 30 టన్నుల మిర్చి అమ్మేశారని వార్తలొచ్చాయి. ఇంకా అంత దిగుబడి వచ్చిన మిర్చి రైతు ఇంట్లోనే ఇంకా నిల్వ ఉంది.

మిర్చి కొనుగోళ్లపై పరిమితులు ఇలా

మిర్చి కొనుగోళ్లపై పరిమితులు ఇలా

ఇంతకుముందు మొక్కజొన్న, వరి, కందులు తదితర పంటలకు 100 శాతం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం మిర్చి వరకు వచ్చేసరికి కేవలం 10 శాతం కొనుగోళ్లకు మాత్రమే అనుమతించడం పట్ల రైతులు, తెలంగాణ నిరసన తెలియజేస్తున్నాయి. కేంద్రం అనుమతించిన పరిమితి మేరకు మూడు రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తవుతాయి. ఉమ్మడి పాలకులు అనుసరించిన సాచివేత ధోరణుల వల్ల రాష్ట్రంలో రైతులకు అందుబాటులో శీతల గోదాములు లేవు. ఫలితంగా నష్టం కూడా భారీగానే ఉంటుంది. రమారమీ కేంద్రం భరించే నష్టం కేవలం రూ.26 కోట్లే. మిగతా సొమ్ము ఎవరు భరించాలన్నది కేంద్ర ప్రభుత్వమే సెలవిస్తే బాగుండేది మరి.

భారమంతా రాష్ట్రంపైనే

భారమంతా రాష్ట్రంపైనే

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద జోక్యం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఆహ్లువాలియాకు వినతిపత్రం సమర్పించిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరో అడుగు ముందుకేసి ఏదైనా నష్టం వాటిల్లినా, సమస్యలు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని కూడా కుండబద్ధలు కొట్టడంతో వాస్తవ పరిస్థితేమిటో బోధ పడింది. మార్చి నుంచి మిర్చి రైతుల బాధలు పట్టించుకోండని పదేపదే వినతిపత్రాలు సమర్పించినా, కేంద్రానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరణలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం తొణకలేదు. బెణకలేదు.

రైతుల సంక్షేమం పట్ల కానరాని బాధ్యత

రైతుల సంక్షేమం పట్ల కానరాని బాధ్యత

కానీ రైతులు ఆందోళన బాట పట్టడంతో తామూ ఎక్కడ బాధ్యత వహించాల్సి వస్తుందేమోనన్న భయం కూడా ఉన్నది. మరోవైపు తెలంగాణలో విస్తరించాలని కమలనాథులు కలలు కంటున్నారాయే మరి. ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అమిత్ షా పీఠం వేసుకుని కూర్చుని తెలంగాణలో విస్తరణకు గల అవకాశాలపై అంటే.. ఇతర పార్టీల్లో అసంత్రుప్తులు, మాజీలను, భవిష్యత్‌లో రాజకీయాలు కష్ట సాధ్యమని భావించిన వారిపై ‘వలపు వల' విసిరేందుకు.. తమదైన శైలిలో వ్యూహ రచన చేయబోతున్నారు కమలనాథులు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విస్తరణకు మిర్చి రైతుల ఆందోళన ఎక్కడ అడ్డం పడుతుందోనన్న భయమే తప్ప.. రైతు సంక్షేమం పట్ల బాధ్యతాయుతమైన వైఖరే కనిపించడం లేదంటే అతిశేయోక్తి కాదు.

కంటి తుడిపు చర్యగానే కేంద్రం తీరు

కంటి తుడిపు చర్యగానే కేంద్రం తీరు

ఇప్పటివరకు హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రయోగాల్లో సాదించిన విజయానికి తోడు.. విపక్షాల్లో కొనసాగుతున్న నేతలపై అవినీతి కేసులను.. అక్రమాదాయం పేరిట ఐటీ దాడులతో లొంగదీసుకునే వ్యూహం కూడా అమలులో ఉన్నదనుకోండి.. ఇన్ని రకాలుగా నయానా.. భయానా.. ఒప్పించి పార్టీకి క్రుత్రిమ బలం సాధించి.. ధిక్కారానికి నెలవుగా నిలిచిన తెలంగాణ గడ్డపై పాగా వేద్దామని కలలు కంటున్న వేళ.. రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు వస్తే.. తమ మిర్చి రైతులను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తాయన్న ముందు చూపుతోనే ‘కంటి తుడుపు' చర్యగా మాత్రమే కేవలం 10 శాతం కొనుగోళ్లకు అనుమతినిచ్చిందన్న విమర్శలు ఉన్నాయి.

అధికారం సాకారంతోనే అంతా పూర్తయినట్లేనా

అధికారం సాకారంతోనే అంతా పూర్తయినట్లేనా

ఒకవేళ రైతు అభ్యున్నతి పట్ల నిజమైన ప్రేమ ఉండి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా హస్తినలో ఒకరకంగా పోరాట పటిమ ప్రదర్శిస్తేనే ఫలితాలు లభిస్తాయన్న ద్రుష్టితో ఆలోచించి ఉంటే ఒకింత మెరుగైన ప్రయోజనాలు ఉండేవి. కానీ అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ కేంద్రంతో మెతక వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. పోరాట బాటతోనే తెలంగాణ సాకారమైందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తమ చేతిలో అధికారం ఉన్నందున ఏమైనా చేయొచ్చనే ధోరణి తెలంగాణ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

పోరాడితే తప్ప ఫలితాలు లభించేదెలా?

పోరాడితే తప్ప ఫలితాలు లభించేదెలా?

ఒకవైపు ఖమ్మంలో మిర్చి రైతులు ఆందోళన చేస్తే రాజకీయ నాయకుల కుట్ర అని తోసిపుచ్చి, వాస్తవాలు చూసేందుకు నిరాకరించిన నేపథ్యం తెలంగాణ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తే.. సామాన్యుడు తనకు సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెడ్తాడు. ఇంతెందుకు? గతంలో బీజేపీ కూడా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరాట బాట పట్టిన దాఖలాలు అనేకం. ప్రత్యేకించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ‘ఆధార్' వ్యవస్థ వద్దు పొమ్మన్నారు. జీఎస్టీ అమలుకే వ్యతిరేకమని సెలవిచ్చారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక స్వరం మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
Union Government has give MSP for Mirchi quintol only Rs.5000. It's discremination for telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X