అల్లు అర్జున్ కి అండగా.. రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి!

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపధ్యంలో ఆయనను కోర్టులో హాజరు పరచగా కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ తో కాంగ్రెస్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు.

అల్లు అర్జున్ కి అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్
మీ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు. పుష్ఫ-2 పాన్ ఇండియా సినిమా అని మీతో సహా ప్రపంచమంతా తెలుసు కదా అని ప్రశ్నించిన బండి సంజయ్ సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా.. అయినా ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు రక్షణ ఏర్పాట్లు తీసుకోలేదు? అంటూ ప్రశ్నలు సంధించారు.

Union Home Minister bandi sanjay supports Allu Arjun slams revanth reddy govt
బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేటు
మీ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దుర్మార్గం అంటూ అల్లు అర్జున్ కు అండగా నిలిచారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కు కనీసం సమయం ఇవ్వకుండా బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అని బండి సంజయ్ మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్యని అభిప్రాయ పడ్డారు.

ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వానిది
భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయికి ఇది సముచితం కాదన్నారు. ఇలా అవమానకర రీతిలో అరెస్ట్ చేయటం మంచిది కాదని అభిప్రాయ పడ్డారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం చెందడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్న బండి సంజయ్ , అయితే భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ కేసులో అసలైన వైఫల్యం ఇదే
'పుష్ప: ది రైజ్' అఖండ విజయం తర్వాత అభిమానులు 'పుష్ప: ది రూల్' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఇంతటి హైప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యం అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ మరియు అతని అభిమానులు గౌరవం మరియు క్రమశిక్షణకు మారుపేరు, గందరగోళానికి కాదని అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం దారుణం అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+