నా భర్త పక్కలోకి రావడం లేదు
భర్త తన దగ్గరకు రావడం లేదంటూ ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తోంది. పెళ్లైన మూడోరోజు నుంచే నా భర్త నా పక్కలోకి రావడం లేదంటూ సిగ్గు విడిచి చెప్పిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీఎస్ ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డితో పావని అనే అమ్మాయితో కొద్ది రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి పావని బయటకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది.
పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనతో ఏనాడు సంతోషంగా లేడని.. తనని ముట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయాం చేయాలంటూ రోడ్డెక్కింది. పెళ్లైన మూడోరోజు నుంచి నా భర్త నా పక్కలోకి రావడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు' అని వాపోయింది. తాను వచ్చే సమయానికి కార్తీక్ రెడ్డి కుటుంబ సభ్యులు గెటుకు తాళం వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారని.. పైగా తనపై రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని కన్నీరు పెట్టుకుంది.

తనకు ఎలర్జీ అంటూ లేని పోని ఆరోపణలు చేస్తూ తన భర్తను దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా .. పోలీసులు అక్కడికి చేరుకొని పావనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తి లేదని భర్త ఇంటి ముందే బైఠాయించింది పావని. నా భర్త నాకు కావాలి అంటూ పోరాటం చేస్తోంది. పావని ఎల్బీనగర్‌లోని తన అత్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అయితే పావనికి సోరియాసిస్ ప్రాబ్లం ఉందని, ఆ విషయం దాచి తన కొడుకు కార్తీక్ రెడ్డిని పెళ్లి చేసుకుందని రాజిరెడ్డి చెబుతున్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని ఆయన తెలిపారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications