Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభాస్‌కు పెళ్లి రాసి పెట్టి లేదేమో- ఆరా తీసిన బాలకృష్ణ..!!

హైదరాబాద్: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో బయటికొచ్చింది. బాహుబలి ప్రభాస్, మాచోస్టార్ గోపీచంద్ ఇందులో మెరిశారు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చింది ఆహా ఓటీటీ. తొలి భాగం డిసెంబర్ 30వ తేదీన ఆహా ఓటీటీలో టెలికాస్ట్ కాబోతోంది.

Balakrishna

దీనికి సంబంధించిన తొలి ప్రోమోను ఈ రాత్రి విడుదలైంది. బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలను సంధించారు. ప్రభాస్ పెళ్లి గురించీ ఆరా తీశారు. ప్రభాస్ ఒక్కసారి డార్లింగ్ అని పిలిస్తే- దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా ప్రభాస్ మాయలో పడిపోయానంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడిందులో. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆకట్టుకుంది. చాలామంది అభిమానులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తోన్నారు.

ఇంతకు పెళ్లి ఉందా లేదా ఏంటసలు? అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. రాసిపెట్టి లేదేమో.. అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి కౌంటర్‌గా బాలకృష్ణ మీ అమ్మకు చెప్పిన సమాధానం నాకు చెప్పకయ్యా అంటూ చెప్పారు. నిన్ను ఎక్కువగా ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని అడగ్గా.. డార్లింగ్ అనే పిలుస్తారంటూ బదులిచ్చాడు ప్రభాస్. ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారనగానే ఈ మధ్య టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్.. మర్చిపోతున్నాను అంటూ సమాధానం దాటవేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+