WWF ఇండియా నేషనల్ రేంజర్ కమ్ అంబాసిడర్ ఉపాసన
హైదరాబాద్: అపోలో ఆస్పత్రుల యాజమాన్యంలో ఒకరైన కొణిదెల ఉపాసన జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతను పోషించబోతున్నారు. అపోలో హాస్పిటల్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్న ఉపాసన కొణిదెల.. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) భారత శాఖకు జాతీయ రేంజర్ కమ్ అంబాసిడర్"గా నియమితులయ్యారు.
అపోలో హాస్పిటల్స్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో 4 సంవత్సరాల పాటు ఉపాసన ఈ పదవిలో కొనసాగనున్నారు.

'అటవీ అధికారులు ఉపేక్ష యోధుల లాంటి వారు, వారు జంతువులు, మానవుల భద్రతకు భరోసా ఇస్తున్నారు' అని ఉపాసన కొణిదెల ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. అపోలో హాస్పిటల్స్‌లో అటవీ అధికారులు, స్థానిక వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యులకు ఏ సందర్బంలోనైనా గాయపడితే నాణ్యమైన వైద్యం అందించడానికి తాను కృషి చేస్తానని ఉపాసన చెప్పారు.
My sincere effort to educate people about human wildlife conflict strengthens with this collaboration.
— Upasana Konidela (@upasanakonidela) June 5, 2024
Respect nature and it will bless you in return 🌳 #worldenvironmentday @WWFINDIA @ApolloFND @HospitalsApollo pic.twitter.com/5jQSOvfvdT
'మానవ వన్యప్రాణుల సంఘర్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నా హృదయపూర్వక ప్రయత్నం ఈ సహకారంతో బలపడుతుంది. ప్రకృతిని గౌరవించండి, ప్రతిఫలంగా అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది' అని ఉపాసన కొణిదెల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. పలు సామాజిక, సేవా కార్యక్రమాలను తరచూ చేస్టుంటారు.
సమాజానికి ఉపయోగపడే పలు సందేశాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఇస్తుంటారు ఉపాసన. ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. ఆమెకు క్లీంకార అనే పేరు పెట్టారు. ఆమె వచ్చిన నాటి నుంచి తమ నివాసంలో అనేక మంచి విషయాలు జరుగుతున్నాయని మెగా కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications