ఐపిఎల్‌కు గండం: ఉప్పల్ స్టేడియం సీజ్‌కు ఆదేశాలు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లకు గండం వచ్చి పడిరది. సుదీర్ఘ కాలంగా బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను చెల్లించకపోవడంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కు షాక్ ఇచ్చేందుకు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) సిద్ధపడిరది. బాకీలు చెల్లించకపోవడంతో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియాన్ని శనివారంనాడు సీజ్ చేస్తామని ఐలా ప్రకటించింది.
హెచ్‌సిఎ తమకు 12 కోట్ల రూపాయల భారీ మొత్తం ఆస్తి పన్ను బకాయి పడిరదని ఐలా చెప్పింది. పన్ను చెల్లించకుండా హెచ్‌సిఎ జాప్యం చేస్తోందని ఐలా విమర్శిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 11, 15, 17 తేదీల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

గత శనివారం ఐపిఎల్ మ్యాచ్‌కు ముందే ఐలా అధికారులు స్టేడియాన్ని సీజ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, హెచ్‌సిఎ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఐలా అధికారులతో చర్చలు జరిపారు. దాంతో పన్ను బకాయిలు చెల్లించేందుకు ఐలా అధికారులు హెచ్‌సిఎకు మరింత గడువు ఇచ్చారు.
శనివారంనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులతో ఐలా అధికారులు కలిసి స్టేడియాన్ని సీజ్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. స్థానిక శాసనసభ్యుడి సమక్షంలోనే స్టేడియాన్ని సీజ్ చేయడానికి ఐలా అధికారులు సిద్ధపడ్డారు. దీంతో ఇరు సంస్థల అధికారులతో పాటు స్థానిక శాసనసభ్యుడు స్టేడియం వద్దకు చేరుకున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications