Valentine's day special: సీఎం రేవంత్ రెడ్డి గీతారెడ్డిల ప్రేమ ప్రయాణం!!

ప్రేమ... సృష్టిలోనే అత్యంత తీయనైన పదం. ప్రేమకు కులమత బేధాలు, పేద ధనిక తారతమ్యాలు ఉండవు. ప్రేమను హృదయంతో అనుభూతి చెందుతాం . ప్రేమకు ప్రతిస్పందనగా మరో హృదయమే ఆ అనుభూతిని, ప్రేమ భావనను వ్యక్తం చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు.. జీవితాంతం ఆ ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తున్న వారు, సక్సెస్ఫుల్ ప్రేమ జంటలు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు.

అంతెందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా రెడ్డిలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంటనే. వాలెంటైన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా రెడ్డిల ప్రేమ ప్రయాణాన్ని, వారి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని తెలుసుకుందాం. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తను చదువుకునే రోజుల్లో గీతారెడ్డిని ప్రేమించారు. వీరిద్దరి పరిచయం ఒక బోటులో మొదలైంది.

Valentines day special: CM Revanth Reddy Geetha Reddy successful love story

ఇంటర్ చదువుకునే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ రెడ్డి తొలిసారి గీతారెడ్డిని బోట్లో చూశారు. రేవంత్ రెడ్డి గీతారెడ్డిని పరిచయం చేసుకుని ఆమె కుటుంబ వివరాలు తెలుసుకుని ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత అదికాస్త స్నేహంగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి కోసం స్వయంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసి ఆమెకు పంపిస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ కథ మొదలైంది. మొదట రేవంత్ రెడ్డి తన ప్రేమను గీతారెడ్డికి తెలియజేశారు. అయితే రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని, రేవంత్ రెడ్డి ముక్కుసూటి తత్వాన్ని చూసిన గీతారెడ్డి అవి నచ్చి రేవంత్ రెడ్డి ప్రేమను అంగీకరించారు. ఇలా కొంతకాలం తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దవారి దాకా వెళ్ళింది.

Valentines day special: CM Revanth Reddy Geetha Reddy successful love story

దీంతో గీతారెడ్డిని ఆమె కుటుంబ సభ్యులు కొంతకాలం పాటు దూరంగా పంపించారు. రేవంత్ రెడ్డి ని కలవకుండా చేశారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ రెడ్డి నేరుగా ఆమె తరుపు పెద్దలతో మాట్లాడి తాను గీతారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి వారందరిని ఒప్పించారు. తన ప్రేమను గెలిపించుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో రేవంత్ రెడ్డి గీతారెడ్డిల వివాహం 1992వ సంవత్సరంలో జరిగింది.

అప్పటినుండి ఇప్పటివరకు ఆ జంట ఒకే మాటగా, ఒకే బాటగా నడుస్తున్నారు. రాజకీయ జీవితంలో ఉన్న రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్న గీతారెడ్డి కుటుంబ వ్యవహారాలను తానే దిద్దుకుంటుంది. రాజకీయాలలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇద్దరు ఒకరికి ఒకరుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా నిలుస్తున్న ఈ జంట నిజమైన ప్రేమకు అర్థం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+