డిగ్రీలో సత్తా చాటిన "వీణా- వాణి".. పిల్లలంటే ఇట్లుండాలి అంటున్నారు..

ఇటీవలి కాలంలో చాలామంది యువత సోషల్ మీడియా, రీల్స్, యూట్యూబ్ అంటూ కాలక్షేపం చేస్తున్నారు. కాళ్లు చేతులు దేవుడు సరిగానే ఇచ్చినా పనీ పాటా లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ఆన్ లైన్ బెట్టింగులు, డ్రగ్స్, లవ్ ఫెయిల్యూర్స్ అంటూ జీవితాన్ని ఆగం జేసుకుంటున్నారు. అయితే అవిభక్త కవలలు వీణా-వాణిలు మాత్రం దేవుడు వైకల్యం ఇచ్చినా పోరాడుతూ చదువుల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం సీఏ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పిల్లలంటే ఇట్లుండాలి అని సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆణిముత్యాలు అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

హైదరాబాద్‌ లోని స్టేట్ హోమ్‌ ‌లో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు వీణా- వాణిలు గతేడాది 22 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అలాగే తాజాగా డిగ్రీ పరీక్షలను విజయవంతంగా రాసి డిస్టింక్షన్​ లో డిగ్రీ పూర్తిచేశారు. ప్రస్తుతం ఉన్న యువత అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. దేవుడు వైకల్యం ఇచ్చినా కష్టపడి చదివి విజేతలుగా నిలిచారు. పుట్టుకతోనే అవిభక్త కవలలుగా జన్మించారు వీణా-వాణి. ఊహ తెలిసినప్పటి నుంచీ కలిసే ఉన్నారు. హైదరాబాద్ లోని​ శిశు విహార్​ కు వచ్చిన తర్వాత చదువు మీద మక్కువ పెంచుకున్నారు. అలా విజయవంతంగా టెన్త్, ఇంటర్ పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా డిగ్రీ పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాము ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్లు సీఏ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

వీణా-వాణిల పరిస్థితిని అర్ధం చేసుకున్న యూనియన్‌ బ్యాంక్‌ రిటైర్డ్‌ ఏజీఎం సుధాకర్‌ డిగ్రీలో ముఖ్యమైన సబ్జెక్టులు బోధించారు. ఈ మేరకు సుధాకర్‌ గారికి వీరు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక సంరక్షణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. అక్టోబరు 16 వస్తే ఈ కవలలు 23వ వసంతంలోకి అడుగుపెడతారు.

Veena and Vani Triumph Conjoined Twins from Hyderabad Earn Degrees with Distinction

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళీ- నాగలక్ష్మి దంపతులకు మొత్తం నలుగురు కుమార్తెలు. రెండో సంతానంగా 2003 అక్టోబర్ 16న అవిభక్త కవలలు వీణా-వాణి జన్మించారు. వీరికి అక్క, చెల్లి కూడా ఉన్నారు. వీరికి 19 ఏళ్లు వచ్చే వరకు బాలసదన్​ లోనే ఉన్నారు. ఆ తర్వాత సొంతూరు వచ్చి పరీక్షలపై దృష్టి సారించారు. ఇంట్లోనే ఉంటూ వారు డిగ్రీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తాజాగా డిగ్రీలో సత్తా చాటిన వీణా-వాణిలకు గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. పిల్లలంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+