Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీలో విజయోత్సాహం.. బండి సంజయ్ కృతజ్ఞతా సభ అందుకు నిదర్శనం!!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిలో విజయోత్సాహం కనిపిస్తుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న సాయంత్రం కరీంనగర్లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇది బిజెపి కృతజ్ఞత సభనా... లేక విజయోత్సవ సభనా అన్నట్టుగా క్రిక్కిరిసిపోయిన జనాలతో ఈ గెట్ టుగెదర్ బ్రహ్మాండంగా జరిగింది.

బండి సంజయ్ కృతజ్ఞతా సభ... రోడ్లపై ట్రాఫిక్ జామ్
బండి సంజయ్ కృతజ్ఞతా సభ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ నేపధ్యంలో మళ్ళీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నూతన ఉత్సాహాన్ని నింపుతాయి అని అంతా భావిస్తున్నారు. వేలాదిమంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. బొమ్మకల్ బైపాస్ పైనా జనం బారులు తీరారు. దీంతో బొమ్మకల్ బైపాస్ రోడ్డు మొత్తం కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Victory spirit in BJP Bandi Sanjay gratitude meeting is proof of that

బండి సభకు హాజరైన ఎంపీ అభ్యర్థులు
మరోవైపు ఈ గెట్ టు గెదర్ కార్యక్రమానికి వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, పెద్దపల్లి నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఆరూరి రమేశ్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్ తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, జెనవాడ సంగప్ప తదితరులు హాజరయ్యారు.

ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల దిమ్మ తిరగడం ఖాయమన్న బండి
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను చూసి అతిథులుగా వచ్చిన నేతలతోపాటు నాయకులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను చూసిన నేతలంతా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని చెబుతున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జూన్ 4న వెలువడే ఫలితాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల దిమ్మ తిరగడం ఖాయమన్నారు.

కేసీఆర్ కు షాకిచ్చే ఫలితాలు
కేసీఆర్ కు ఈ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయన్నారు. దేశమంతా నరేంద్రమోదీ హవా కొనసాగుతోందని, తెలంగాణ అంతటా బీజేపీకి అత్యధిక ఫలితాలు రాబోతున్నాయన్నారు. ఆరూరి రమేశ్, సీతారాంనాయక్, సైదిరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అంతటా అద్బుత ఫలితాలు వస్తున్నాయనడానికి ఇక్కడికి వచ్చిన ప్రజలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

బండి సంజయ్ తో సెల్ఫీలకు ఎగబడ్డ జనాలు
బండి సంజయ్ గెట్ టు గెదర్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు బండి సంజయ్ తో సెల్ఫీలు తీసుకోవటానికి ఎగబడ్డారు. ఆయన పక్కన నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు. బండి సంజయ్ గెట్ టు గెదర్ కు వచ్చిన జనం బండి ఇమేజ్ కు సాక్ష్యంగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+