• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ తో పీజేఆర్ కుమార్తె భేటీ - కాంగ్రెస్ లోకి ఎంట్రీ : ముహూర్తం ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

ఆపరేషన్ ఆకర్ష్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ తెర తీసారు. అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తులను గుర్తించి తమ వైపు తిప్పుకొనే కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా..టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. కానీ, దక్కలేదు. ఆ ఎన్నిక సమయంలోనే ఎన్నికల హాల్ నుంచి విజయా రెడ్డి సడన్ గా వెళ్లిపోయారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో పీజేఆర్ వారసులుగా తనకు ప్రాధాన్యత దక్కాలని విజయా రెడ్డి కోరుకున్నారు. అయితే, అక్కడ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. అదే సమయంలో తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదనే అసంతృప్తితో విజయా రెడ్డి ఉన్నారు. గతంలోనూ పలు సార్లు విజయా రెడ్డి తనలోని అసంతృప్తిని బయట పెట్టారు. విజయా రెడ్డి పార్టీ వీడుతున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఇప్పటికే చర్చలు చేసారు. వారితో తాను టీఆర్ఎస్ తోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు రేవంత్ తో సమావేశమైన తరువాత ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరనున్నట్లు విజయా రెడ్డి ప్రకటించారు.

Vijaya Reddy decided to leave TRS and join in Congress, met TPCC Chief Revanth Reddy

తన తండ్రి రాజకీయాలను కొనసాగిస్తానని వెల్లడించారు. దీంతో..టీఆర్ఎస్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. పీజేఆర్ తనయుడు విష్ణు రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన విష్ణు.. ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు విజయారెడ్డి తాను కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించటంతో..వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ పైన ఆ పార్టీ నుంచి హమీ దిక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరిన తరువాత తాను టీఆర్ఎస్ ఎందుకు వీడిందీ విజయా రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తోంది.

English summary
PJR' daughter an TRS greater corporator Vijaya reddy met TPCC Chief Revanth, decied to join in congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X