బీజేపీకి విజయశాంతి గుడ్ బై అంటూ ప్రచారం.. రాములమ్మ స్పందన ఇదే!!

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలున్నాయని ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తెలంగాణా బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య పొసగటం లేదన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మరో నాలుగైదు నెలల్లో తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని, పార్టీని వదిలి వెళ్లిపోతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది బీజేపీ నేతలకు తలనొప్పిగా మారింది.

మొన్న ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరగగా, ఈటల రాజేందర్ దానికి క్లారిటీ ఇచ్చారు. తాను బిజెపి ని వదిలి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కూడా తమపై వచ్చిన పార్టీ మార్పు వార్తలకు, ప్రచారానికి సమాధానం చెప్పారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పారు.

Vijayashanthi

ఇక తాజాగా బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆమె పార్టీ నేతల తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలను, ఈ ప్రచారాన్ని విజయశాంతి తీవ్రంగా ఖండించారు. తాను బిజెపిని వీడడం లేదని, బీజేపీలోని తాను కొనసాగుతానని విజయశాంతి స్పష్టం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి రెండు రోజుల నుంచి రాములమ్మ బిజెపి పార్టీకి గుడ్ బై చెబుతున్నారు పార్టీతో అభిప్రాయభేదాలు ఉన్నాయని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది సరైనదో కాదో ప్రచారం చేసే వాళ్ళకి తెలియాలి అంటూ ఆమె పేర్కొన్నారు.

తనైతే మహాశివుని కాశీ మహా పుణ్యక్షేత్రంలో గరళకంఠుని సన్నిధిలో ఆ ఆదిదేవుని దర్శనార్థమై వచ్చానని విజయశాంతి పేర్కొన్నారు. హరహర మహాదేవ్ అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు. ఈ పోస్టు ద్వారా తనకు బీజేపీకి గుడ్ బై ఆలోచన లేదని విజయశాంతి స్పష్టం చేశారు. ఇది కావాలని జరుగుతున్న దుష్ప్రచారం గా ఆమె తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+