Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌ను వదలొద్దు..! విజయశాంతి హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పొల్గొన్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సొంతం కాదని స్పష్టం చేశారు.

నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి అని విజయశాంతి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanti faces severe criticism for targeting KCR

ఎందుకంత అంత కుట్రబుద్ధి? దొరబుద్ధి చూపిస్తున్నారు? బడుగు బలహీన వర్గాలను చూడకుండా.. తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారని గత కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని చెప్పారు.

ఏం చేశావో చెప్పు.. చేసిన తప్పులు ఒప్పుకో అని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను వదిలిపెట్టకూడదని అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు? అని విజయశాంతి నిలదీశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటమే తన ధ్యేయమని అన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.

మరోవైపు, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు విజయశాంతి. ఒక ఓటుతో రెండు రాష్ట్రాల వాగ్ధానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగానే తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించారని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో ఉన్నారని చెప్పారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి మంచి స్నేహితులని విజయశాంతి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+