తెలంగాణ కోసం చేసిన పోరాటం మళ్లీ ఇప్పుడు చేద్దాం; సీఎం కేసీఆర్ పై శివాలెత్తిన విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలపై విజయశాంతి తనదైన శైలిలో స్పందిస్తున్నారు. నిత్యం కేసీఆర్ ను టార్గెట్ చేసే విజయశాంతి తాజాగా మరోమారు కేసీఆర్ పై మండిపడ్డారు . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న విజయశాంతి తెలంగాణ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ మరియు ఆయన కుటుంబం పై నిప్పులు చెరిగారు. అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు అని పేర్కొన్న విజయశాంతి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని కెసిఆర్ ఏడేళ్లపాటు ఏం చేశారని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేయడం లేదని పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పడుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు విజయశాంతి. ప్రభుత్వ ఉద్యోగులను తాను పెన్ డౌన్ చేయమని అడగడం లేదని కానీ ఓ గంట పాటు ఉద్యోగం కోసం గొంతు విప్పాలని విజయశాంతి పిలుపునిచ్చారు.

ప్రభుత్వాన్ని కూలదోసే సత్తా యువతకే ఉంది
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని విజయశాంతి పేర్కొన్నారు .ప్రభుత్వాన్ని కూల్చివేసే సత్తా, ధైర్యం యువతకు ఉందని పేర్కొన్న విజయశాంతి నిరుద్యోగులు అందరూ తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు విజయశాంతి. పోరాడి సాధించుకోవాలి కానీ ఆత్మహత్యలతో ఫలితం ఉండబోదని స్పష్టం చేశారు.

సచివాలయంలోనూ పేరుకుపోతున్న పెండింగ్ ఫైళ్ళు
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం వల్ల, చాలా ఖాళీలు ఉండటం వల్ల జిల్లాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయి అన్న విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలోనూ ఫైళ్ళు పేరుకుపోతున్నాయి అని విమర్శించారు. సీఎం కెసిఆర్ సచివాలయానికి రాకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని విజయశాంతి ఆరోపించారు. సీఎం కేసీఆర్ పని చేయకుండా జీతం తీసుకుంటున్నాడని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అందరూ పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి .

తెలంగాణా కోసం చేసిన పోరాటం మళ్ళీ ఇప్పుడు చేద్దాం
తెలంగాణ కోసం చేసిన పోరాటం మళ్లీ ఇప్పుడు చేద్దామని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు విజయశాంతి. కెసిఆర్ ప్రభుత్వం పై పోరాటం సాగించాలని నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి బిజెపి సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు విస్తరించినప్పుడు ఆయా శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉంటాయని, ఆ ఖాళీలలో ఎందుకు నోటిఫికేషన్ లు రిలీజ్ చేయడం లేదని విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పోషిస్తున్నారని, ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలను చదివిస్తున్నారని కేవలం ఉద్యోగాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజయశాంతి తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాము అండగా ఉంటామని పేర్కొన్న విజయశాంతి సీఎం కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పడానికి యువత ముందుకు రావాలన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications