వికారాబాద్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం .. వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ .. రీజన్ ఇదే
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 644కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఇక ఈ నేపధ్యంలో కేంద్ర సర్కార్ కంటే ముందే తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించింది . సామాజిక దూరం పాటించాలని , మాస్కులు లేకుండా బయటకు తిరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ ను చాలా కఠినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .
తెలంగాణా ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇది తెలంగాణా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తుంది . నిన్న ఒక్కరోజు తెలంగాణలో 52 కరోనా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .
ఇక నిన్న నమోదైన కేసుల్లో 40 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో కేంద్రం గ్రేటర్ పై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాట్ స్పాట్, కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది.ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా గ్రేటర్ ను అనుకోని ఉన్న వికారాబాద్ జిల్లాలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Recommended Video
వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 29 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కవ కేసులు వికారాబాద్ పట్టణంలోనే ఉండటం గమనార్హం. దీంతో వికారాబాద్ పట్టణాన్ని వారం రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ నిత్యావసరాల కోసం కూడా రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు .
నిత్యవసర వస్తువులకు సంబంధించిన షాపులను కూడా మూసివేసి మరీ లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు . వారం రోజులపాటు పట్టణంలో పూర్తిగా లాక్ డౌన్ ను విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రత్యామ్నాయంగా ప్రజలకు కావాల్సిన వస్తువులను ఇంటి వద్దకే పంపుతామని అధికారులు అంటున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications