ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన: లాఠీఛార్జీతో రెచ్చిన గ్రామస్తులు, పోలీసులపై దాడి
నారాయణపేట: మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ రసాయన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడాన్ని నిరసిస్తూ ఎక్లాస్ పూర్ స్టేజీ వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు, సిబ్బంది సహా పలువురు స్థానికులకు గాయాలయ్యాయి.
చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలను లారీల్లో తీసుకువెళ్లి చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో వదిలి వేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎక్లాస్ పూర్లో రెండు రోజుల కిందట ఓ లారీని పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. శనివారం రాత్రి కూడా రసాయన వ్యర్థాలతో కూడిన మరో లారీని పట్టుకున్నారు. ఆ లారీతో మరికల్- ఆత్మకూర్ రోడ్డుపై ధర్నాకు దిగారు.

రసాయన వ్యర్థాలను వాగుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, చెరువుల్లో వదలడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, తమకు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇథనాల్ పరిశ్రను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

రసాయన వ్యర్థాలను బైటకు వదలిన కంపెనీపై చర్యలు తీసుకునే వరకూ నిరసనను విరమించేది లేదని ధర్నాకు దిగారు గ్రామస్తులు. ఈ క్రమంలో ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల వాహనాలపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులపై గ్రామస్తుల పై కట్టెలు, రాళ్లతో దాడి
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2023
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఉన్న జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ట్యాంకర్ ద్వారా బయటకు తీసుకెళ్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
పోలీసులు ఆందోళనకారులని చెదరకొడుతున్న క్రమంలో ఆగ్రహించిన గ్రామస్థులు కట్టెలు, రాళ్లతో… pic.twitter.com/aWV1onkn9w
పలువురు పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. దీంతో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా గ్రామస్థులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. గ్రామస్తులలను ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications