హైదరాబాద్ నుంచి 120 కి.మీ దూరంలోనే వైజాగ్ అందాలు.. చుట్టూ కొండలు.. మధ్యలో ఐల్యాండ్..

సెప్టెంబర్ వచ్చేసింది. ఈ నెలలో సెలవులు భారీగానే ఉన్నాయి. దసరా సెలవులు, ఇతర హాలీడేస్ కలిపితే దాదాపు 15 రోజుల పాటు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ హాలీడేస్ లో ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? హైదరాబాద్ వాసులకు అతి సమీపంలోనే అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే వైజాగ్ కాలనీ.. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చుట్టూ కొండలు, ఆపైన సాగర్ బ్యాక్ వాటర్ అందాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉంటుంది. దీనికితోడూ నీళ్ల మధ్యలో ఐల్యాండ్ కూడా ఉంటుంది.

బోట్ రైడింగ్ తో పాటు సాహస యాత్రను ఇష్టపడేవారికి వైజాగ్ కాలనీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉంది. ఈ ప్లేస్ హైదరాబాద్ నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్‌ వాటర్స్‌ లో ఉన్న చిన్న గ్రామామే వైజాగ్ కాలనీ. హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే వెళ్లి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రాంతానికి వైజాగ్ కాలనీ అని పేరు ఎందుకు వచ్చిందంటే.. సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఏపీ‎లోని విశాఖపట్నం నుంచి డ్యామ్ నిర్మాణం కోసం వచ్చిన 24 కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని వైజాగ్ కాలనీ అంటారు. ఈ గ్రామం చుట్టూ ఉన్న ఆకుపచ్చని ఎత్తయిన కొండలు, పొలాలతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది.

ఇక్కడి నుంచి 20 నిమిషాల బోట్ రైడ్‌ చేస్తే.. దగ్గర్లో ఉన్న గ్రీన్ ఐలాండ్‌ కు చేరుకోవచ్చు. ఇక్కడ రైడ్‌ కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.200 తీసుకుంటారు. ఈ రైడ్ బ్యాక్‌ వాటర్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాక స్థానిక చేపల వేటగాళ్లతో రూ.1500 కు ఓవర్‌ నైట్ క్యాంపింగ్ కూడా చేయవచ్చు. నీటి మధ్యలో రాత్రి రొమాంటిక్‌ గా ఎంజాయ్ చేయోచ్చు.

Vizag Colony Hyderabad s Stunning Tourist Gem with Hills and Sagar Backwaters

ఈ వైజాగ్ కాలనీ ప్రదేశానికి హైదరాబాద్ నగరం నుంచి తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు అత్యంత దగ్గర్లోనే ఈ ప్లేస్ ఉంది. వైజాగ్ కాలనీ చేరుకోవాలంటే సాగర్ హైవేపై ఉండే మల్లెపల్లి చౌరస్తా దాటిన తర్వాత కుడి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే దేవరకొండ టౌన్ కు చేరుకొని కూడా మరో రూట్ లో వెళ్లొచ్చు. పెద్ద మునిగల్, చిన్నమునిగల్ దాటగానే వైజాగ్ కాలనీ ప్రదేశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+