వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమీ కలెక్టర్ గారూ.. వీఆర్ఏలు టెన్నిస్ బాల్ ఇవ్వాలా..? నిర్మల్ ఐఏఎస్ తీరుపై విమర్శలు

|
Google Oneindia TeluguNews

ఐఏఎస్.. కలెక్టర్.. అడ్మినిస్ట్రేషన్‌లో హోదా, గౌరవం ఉంటుంది. అంటే పరిపాలన చేయడమే కానీ.. కింది స్థాయి ఉద్యోగులతో చాకిరీ చేయించుకోవడం కాదు. అవును చాలా మంది ప్రొఫెషనల్‌గా ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ హోదా అడ్డుపెట్టుకుంటారు. తమ కింద పనిచేసేవారితో పని చేయించుకుంటారు. అవును పనులంటే.. మాములు కాదు.. అలా నిర్మల్ కలెక్టర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఇదీ రచ్చ రచ్చ కావడంతో తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వీఆర్ఏలు బాల్స్ అందించేవారు..

వీఆర్ఏలు బాల్స్ అందించేవారు..

క‌లెక్ట‌ర్ టెన్నిస్ ఆడుతుంటే... బంతుల‌ను అందించేందుకు వీఆర్ఏల‌కు డ్యూటీలు వేశార‌నే వివాదం వైర‌ల్ అయింది. అదీ నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ కాగా.. వీఆర్ఏలు అతనికి టెన్నిస్ బాల్ అందించేవారు. దీనిపై దుమారం చెలరేగింది. తహశీల్దార్ వారికి డ్యూటీ వేశారట.. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కలెక్టర్ స్పందించాల్సి వచ్చింది. నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ముష‌ర‌ఫ్ అలీ రియాక్ట్ అయ్యారు. విషయం తన దృష్టికి లేద‌ని చెప్పి తప్పించుకున్నారు.

బాధ్యత అప్పగించిన తహశీల్దార్

బాధ్యత అప్పగించిన తహశీల్దార్

వీఆర్ఏల‌కు టెన్నిస్ బంతులు అందించే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ త‌హ‌సీల్దార్ విడుద‌ల చేసిన జాబితాను చూసి తాను మాట్లాడ‌తాన‌ని పేర్కొన్నారు. నిర్మ‌ల్‌లో ప్రారంభ‌మైన తొలి టెన్నిస్ స్టేడియం ఇదేన‌ని, ఇందులో ఎవ‌రైనా ఆడుకునేందుకు వ‌చ్చే వీలుంద‌ని అలీ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో వీఆర్ఏలు వ‌చ్చి ఉంటారేమోన‌ని తెలిపారు. ఇత‌ర శాఖ‌ల అధికారులు, సామాన్య ప్ర‌జ‌లు కూడా ఈ కోర్టులో ఆడుకునే వీలుంద‌న్నారు.

చర్యలు తీసుకుంటారట

చర్యలు తీసుకుంటారట

వీఆర్ఏల‌కు విధుల విష‌యంలో జ‌రిగిన వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలించాక... అవ‌స‌ర‌ం అనుకుంటే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌పై ఉన్న‌తాధికారుల వేధింపులు ఉన్న‌ట్టయితే త‌న‌ను క‌లిసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. వాస్తవానికి అతనికి సాయం చేయడానికి వీఆర్ఏలు పనిచేశారు. అతనికి బాల్స్ అందించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు తనకేం తెలియదని అంటున్నారు. అంతేకాదు విధులు వేస్తే చర్యలు తీసుకుంటానని బుకాయిస్తున్నాడు. ఇదీ బాగుందని నెటిజన్లు అంటున్నారు. అతనికోసమే డ్యూటీ చేస్తే.. ఇప్పుడు బుకాయించడం ఏంటీ అని నిలదీస్తున్నారు. కానీ కిందిస్థాయి అధికారులను వేధించడం మాత్రం తగదని కామెంట్ చేస్తున్నారు.

English summary
vra to given tennis balls to nirmal collector. tahsildar allot vra to help collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X