స్ట్రాంగ్ లీడర్ కావాలా?రాంగ్ లీడర్ కావాలా? తెలంగాణ ప్రజలకు ట్రబుల్ షూటర్ సూటి ప్రశ్న.!
హైదరాబాద్ : వైద్యులు తెలంగాణ భవన్ లోకి వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయమని, స్ట్రాంగ్ లీడర్ కావాలా, రాంగ్ లీడర్ కావాలా అందరూ ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రజలను ప్రశ్రించారు. చంద్రశేఖర్ రావు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించాడని, తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ మరెవ్వరికి ఉండదని, మిగతా రాజకీయ పార్టీలది పదవుల కోసం ప్రయత్నమన్నారు హరీష్ రావు. కానీ సీఎం చంద్రశేఖర్ రావు ఒక టాస్క్ లాగా భావించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 60 ఏండ్ల కరెంట్ కోతలు డాక్టర్లుగా మీరు చూశారని, తెలంగాణలో నేడు సుపరిపాలన ఏ స్దాయితో అందుతుందో చూస్తున్నారని అన్నారు.
పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా : నాడు ఎంబీబీఎస్ చదవాలంటే పక్క దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించామని అన్నారు హరీష్ రావు. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడటం లేదని, కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు హరీష్ రావు.

తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తది : హైదరాబాద్ హెల్త్ హబ్, ఫార్మా హబ్ గా, ఐటీ హబ్ గా ఎదిగిందన్నారు హరీష్ రావు. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1, వైద్యుల ఉత్పత్తిలో నెంబర్ 1 నాడు బెంగాల్ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనే వారని, కాని దాన్ని తిరగరాసింది తెలంగాణ రాష్ట్రం అన్నారు హరీష్ రావు. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనేంతగా అభివృద్ధి చేశామన్నారు హరీష్ రావు. గ్రామీణ అవార్డుల్లో 38శాతం అవార్డులు తెలంగాణకే వచ్చాయని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించిన తెలంగాణ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ కో జల్ అని కాపీ కొట్టిందన్నారు హరీష్ రావు.

కేంద్రం తెలంగాణ పథకాలను కాపీ కొడుతుంది : రైతుల కోసం రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం చంద్రశేఖర్ రావుదని, రైతు బంధును పీఎం కిసాన్ సమ్మాన్ నిధిగా కేంద్రం అమలు చేస్తున్నదన్నారు హరీష్ రావు. అయితే తెలంగాణ ప్రభుత్వం పది వేలు ఇస్తే, కేంద్రం మూడు వేలే ఇస్తున్నదన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. విశ్వకర్మలకు లక్ష ఆర్థిక సాయం అంటే, దాన్ని కేంద్రం కాపీ కొట్టి విశ్వ కర్మ యోజన అని ప్రారంభించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం ఇస్తే, కేంద్రం మాత్రం అప్పు రూపంలో ఇస్తున్నదని, మక్కీకి మక్కీ తెలంగాణ పథకాలను కేంద్రం కాపి కొడుతున్నదన్నారు హరీష్ రావు.

సీఎం ముందు చూపు : తెలంగాణ పథకాలు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, కల్యాణ లక్ష్మీ అంటే ఆర్థిక సాయం మాత్రమే కాదని, బాల్య వివాహాలను నివారించిందన్నారు. పోలీసులు, చట్టం చేయలేని దాన్ని సీఎం చంద్రశేఖర్ రావు పెట్టిన ఒక పథకం సాధించిందన్నారు. కల్యాణ లక్ష్మీ గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందని, సామాజిక మార్పుకు నాంది పలికిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా గొప్పమార్పు వచ్చిందని, ప్రతి పథకం వెనుక సామాజిక కోణం దాగి ఉందని అదే చంద్రశేఖర్ రావు ముందుచూపన్నారు మంత్రి హరీష్ రావు. గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు, ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు.












Click it and Unblock the Notifications