పెళ్లి పేరుతో మహిళ ఘరానా మోసం.. నగదు, బంగారంతో జంప్..

ఆమెకు అప్పటికే వివాహం జరిగింది. 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని ఓ యువకుడిని నమ్మించింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయింది. మాయమాటలు చెప్పి పెళ్లి వరకూ తీసుకెళ్లింది. పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత ఇంట్లోని 8 తులాల బంగారం.. రూ. 2 లక్షలకుపైగా నగదు తీసుకుని అక్కడినుంచి జంప్ అయింది. దీంతో తాను మోసపోయానని భావించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

పెళ్లి పేరుతో ఓ యువతి ఘరానా మోసం చేసింది. మ్యాట్రిమోని సైట్ లో ఓ యువకుడికి పరిచయం అయింది. పెళ్లి కాలేదని వలలో పడేసింది. తీరా పెళ్లి అయ్యాక రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఇంట్లో నుంచి పరార్ అయింది. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసపోయామని భావించి ఈ ఘటనపై పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు యువకుడి కుటుంబ సభ్యులు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మ్యాట్రిమోని సైట్ ద్వారా.. విజయవాడకు చెందిన యువతికి, వరంగల్ జిల్లాకు చెందిన యువకుడికి వివాహం కుదిరింది. అమ్మాయి నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుడు. పెళ్లి కోసం ఫేక్ తల్లిదండ్రులను ఏర్పాటు చేసింది ఆ మహిళ. ఈ విషయాన్ని వరుడి కుటుంబ సభ్యులు గ్రహించలేదు. ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. తీరా పెళ్లి అయ్యాక నగదు, బంగారంతో వధువు అక్కడి నుంచి పారిపోయింది. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు అంతా ఫేక్ అని తెలుసుకున్న యువకుడి కుటుంబం మోసపోయినట్లు గ్రహించారు. తమను మోసం చేసిన యువతిపై పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Warangal Bride Jumps to Death with 2 Lakh Cash amp amp 8 Tolas Gold After Marriage Fraud

అయితే గతంలో ఇదే మహిళ మరో ఇద్దరిని ఇలాగే మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. అంతేకాక ఆమెకు 16 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే విషయంపై.. మ్యాట్రిమోనీ.. ఇతర వెబ్ సైట్స్ లో పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో వరుడు, వధువు గురించి అలాగే వారి కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే సంబంధాలు కుదుర్చుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+