రాను ముంబైకి రాను..డ్యాన్స్ అదరగొట్టిన వరంగల్ సీపీ వీడియో వైరల్!

తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ చాలా ఘనంగా జరుగుతుంది. తెలంగాణా పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా పోలీసులు ఆడి, పాడి ఎంజాయ్ చేశారు. తెలంగాణా పోలీస్ డ్యూటీ మీట్ రెండవ రోజు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోలీసులు అదరగొట్టారు.

సహచర అధికారులతో కలిసి స్టెప్పులేసిన వరంగల్ సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తన సహచర అధికారులతో కలిసి స్టెప్పులేశారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సినిమా పాటలకు చిందులేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.గత రెండు రోజులుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధ్వరంలో మామునూరు పిటిసి వేదికగా మొన్న ప్రారంభమైన రెండవ తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ నేడు మూడో రోజు కొనసాగుతుంది.

Warangal CP dance in telangana police duty meet video viral

రెండు రోజులుగా తెలంగాణా పోలీస్ డ్యూటీ మీట్
తొలిరోజు కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట మరియు అడిషనల్ డిజిపి మహేష్ భగవత్ లు ముఖ్య అతిధులు పాల్గొని తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ ను ప్రారంభించారు. రెండవ రోజు డ్యూటీ మీట్‌లో భాగంగా బాంబ్‌ డిస్పోజల్‌, పోలీస్‌ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు, కంప్యూటర్‌, వీడియాగ్రఫీ, సైటిఫిక్‌ ఏయిడ్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపిన సీపీ
ఈ సందర్భంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రెండవ రోజున నిర్వహిస్తున్న పోటీలను పర్యవేక్షించడంతో పాటు తెలంగాణా పోలీస్ డ్యూటీ మీట్‌ ఏర్పాట్లపై ఈ పోటీల్లో పాల్గొన్న వారితో మాట్లాడారు. డ్యూటీ మీట్‌ ఏర్పాట్లు బాగున్నాయని ముఖ్యంగా వసతి,భోజన ఏర్పాట్లపై పోలీస్‌ అధికారులు, సిబ్బంది పోలీస్‌ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

పోలీసులను ఉర్రూతలూగించిన సీపీ డ్యాన్స్
ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈ డ్యూటీ మీట్‌ పోటీలు శనివారంతో ముగుస్తాయని, శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోయే ముగింపు వేడుకలను ముఖ్య అతిధిగా రాష్ట్ర పోలీస్‌ డీజీపీతో డా. జితేందర్‌తో పాటు, జైళ్ళ విభాగం డీజీపీ డా.సౌమ్య మిశ్రా విశిష్ట అతిధిగా పాల్గొంటారని పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిన్న రాత్రి విందు తర్వాత ఆయన పోలీసులతో కలిసి చేసిన డ్యాన్స్ పోలీసులందరిలో ఉత్సాహం నింపింది. ఆయన చేస్తున్న డ్యాన్స్ ను అందరూ తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+