వరంగల్ లోక్సభ కాంగ్రెస్ గెలుపు.. మంత్రి కొండా సురేఖకు షాక్
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగిన విషయం తెలిసిందే. వరంగల్ పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం కావ్య రెండు లక్షల 20 వేల పైచిలుక మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖకు మాత్రం ఊహించని షాక్ తగిలింది.
కొండా సురేఖ ఇలాకాలో బీజేపీకి ఆధిక్యత
ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఈ అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం కూడా ఉంది. మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిజెపికి ఆధిక్యత లభించింది.

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు తగ్గిన ఓట్లు
బిజెపికి 74,581 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 66,720 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 20,360 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కంటే బిజెపి అభ్యర్థికి ఇక్కడ 7954 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం తగ్గడం అక్కడ బిజెపి పుంజుకోవడం మంత్రి కొండా సురేఖకు షాక్ అనే చెప్పాలి.
వరంగల్ తూర్పులో సురేఖ ప్రాభవం తగ్గుతుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరునెలలైనా కాకముందు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాభవం తగ్గడం లోక్సభ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. గత శాసనసభ ఎన్నికల్లో మంత్రి సురేఖకు 15,625మెజార్టీ వచ్చింది. గత ఎన్ని కల్లో కాంగ్రెస్ కు 67,757ఓట్లు రాగా, ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో 66,627 వచ్చాయి. అయితే కొద్దిగానే ఓట్లు తగ్గాయని, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని అంటున్నారు వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులు.
భవిష్యత్ లో కొండాతో పాటు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలైనా కాకముందే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిజెపి ఓటు షేర్ పెరగడం కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ .
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications