సాక్సులకు,చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు.!ప్రకాశ్ జవదేకర్ ను విమర్శిస్తారా.?మండిపడ్డ బీఎస్కే.!
వేములవాడ/హైదరాబాద్ : విషయం ఏదైనా గులాబీ కమలం పార్టీ నేతల మద్య రచ్చ జరగల్సిందే. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తరవాత సంగతి ఒకరిపై ఒకరు మాత్రం ఆరోపణలు గుప్పించుకోవాల్సిందే. ప్రస్తుతం కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ కోణంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడని చెప్పుకొచ్చారు.చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదని, చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారని వివరించారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఆరోజు జరిగిన పరాణామాలను వివరించారు బండి సంజయ్. తాను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తోనే ఉన్నానని స్పష్టం చేశారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఎస్కే. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి ని టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్న ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్ల పెద్దాయన. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నా... దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications