Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mid Manair: ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరులోకి అక్కడ నుంచి లోయర్ మానేరులోకి..!

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 9 గేటును ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలారు అధికారులు. 4 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా వచ్చి వచ్చి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లికి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లిలో నీటి మట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారం రిజర్వాయర్ కు నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి నాలుగు మోటార్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువలోకి నీటిని తరలిస్తున్నారు. వరద కాలువ నుంచి మిడ్ మానేరులోకి నీటి తరలిస్తున్నారు.

Water is being moved from Ellampalli to Mid Manair

మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని పంపుతున్నారు. లోయర్ మానేరులో కనిష్టా స్థాయిలో నీరు ఉండడంతో మిడ్ మానేరు నుంచి నీటి వదలుతున్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 18 టీఎంసీల నీటిని తరలించారు. మిడ్ మానేరు ప్రస్తుతం 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్ మానేరు లోకి ఇంకా 6 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. లోయర్ మానేరులోకి భారీగా వరద రావాల్సి ఉంది.

లోయర్ మానేరు ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేక మానేరులోకి వరద ప్రవాహం లేదు. మోయదుమ్మ వాగు రాకపోవడం, మిడ్ మానేరు నిండకపోవడంతో లోయర్ మానేరుకు నీరు రావడం లేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల చెరువు మత్తడి పారుతోంది. అక్కడి నుంచి గన్నేరువరం చెరువులోకి నీరు చేరుతుంది. గన్నేరువరం చెరువు నిండితో లోయర్ మానేరులోకి నీరు వస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+