కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈరోజు దుబ్బాకలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి కెసిఆర్ ను మరోమారు టార్గెట్ చేశారు. దుబ్బాకను బంగారు తునక చేస్తామని కేసీఆర్, హరీష్ రావులు బొందలగడ్డ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను బక్కోడిని అంటూ కెసిఆర్ ఓట్లకోసం వస్తున్నాడని.. కెసిఆర్ బక్కోడు కాదు భూబకాసురుడు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ తో పాటు ఆయన కొడుకు, ఆయనకు కూతురు ఉండడానికి కూడా ఇల్లు కట్టిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలసొమ్ము దోచుకున్న కేసీఆర్ నుండి లక్షకోట్లు కక్కిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

We will build a double bedroom for KCR in Charlapally Jail: Revanth Reddy

కెసిఆర్ ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, దుబ్బాకకు పట్టిన దరిద్రం ఏదైనా ఉంటే అది కెసిఆర్ కుటుంబమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు .దుబ్బాక కు వచ్చే అభివృద్ధి పనులు నిధులను సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్ రావు తరలించుకుపోతున్నాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా దుబ్బాక ని ఎందుకు బంగారు తునకలా మార్చలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

దుబ్బాకలో రఘునందన్ రావు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని విమర్శించిన రేవంత్ రెడ్డి ఆయనకు ఓట్లు అడగడానికి అర్హత లేదన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి పేరులోనే కొత్త ప్రభాకర్ రెడ్డి అని ఉంది కానీ ఆయన పాత చింతకాయ పచ్చడే అని విమర్శించారు.

మెదక్ ఎంపీగా రెండుసార్లు గెలిపించినా దుబ్బాక కు ఏమి నిధులు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ను రెవిన్యూ డివిజన్ గా చేయలేదని, కనీసం డిగ్రీ కాలేజ్ కూడా తీసుకు రాలేదని మండిపడ్డారు. తెలంగాణా కెసిఆర్ కుటుంబ సభ్యులకు బంగారు తెలంగాణ అయిందని, పేదలు మరింత నిరుపేదలుగా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి అందుకే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుతున్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+