వెదర్ అలర్ట్: తెలంగాణను చుట్టేసిన రుతువపనాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నై రుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అదే విధంగా కొన్ని జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాగా, 16 జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, మంగళవారం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు, పిడుగుపాటుకు సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందారు.












Click it and Unblock the Notifications