Weather : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది.
జార్ఖండ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా, ఛత్తీస్‌గఢ్ , విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు మధ్య ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు పేర్కొన్నారు.

ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు వాతావరణ శాఖ తెలిపారు. ఉరుములు , మెరుపులుతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, కొత్తగూడెంతోపాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడ్డాయి.
హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల వర్షం నమోదైంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలు కూడా క్రియాశీలంగా మారడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటు వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications