తెలంగాణాను హెచ్చరించిన వాతావరణ శాఖ
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కోసం రైతులు ప్రజలు, ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో ఈ సంవత్సరం రైతాంగానికి సరిపడా నీరు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాసంలో అయినా వర్షాలు కురిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణాలో నేడు వర్షాలు
ఇదిలా ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణ ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు బలపడడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి.

తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఇక దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, ములుగు, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం 13 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్
వర్షాలతో పాటు గంటకు 30నుండి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు ఎక్కువ పడే అవకాశం ఉన్న కారణంగా వ్యవసాయపనులు చేసుకునే రైతులు. వ్యవసాయ కూలీలు, గొర్రెలు మరియు పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లకుండా ఉంటే మంచిదని పేర్కొంది.
హైదరాబాద్ లో వాతావరణం ఇలా
ఇక మరోవైపు హైదరాబాద్ లో చూసినట్లయితే, వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్లో సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్ళకూడదని అవసరమైతే తప్ప రిస్క్ చేయకూడదని పేర్కొంది.












Click it and Unblock the Notifications