Rain: మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కాస్త ఎడతెరిపినిచ్చింది. అయితే, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

గురువారం నుంచి శుక్రవారం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 'వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 weather: next three-four days heavy rains these telangana districts.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా, గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 42.3 మి.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం ఉదయం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌లో భారీ వర్షం పడింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ జంట నగరాలతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

ఇక, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏటా జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 తేదీ వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు రాష్ట్రంలో 72.10 సెం.మీ సాధారణ వర్షపాతం. సెప్టెంబర్‌ 7వ తేదీ నాటికే (గురువారం) 74.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే వర్షం కురడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+