Weather Update: రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. కుమురభీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, కామా రెడ్డి, మెదక్, మెడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నాగర్‌కర్నూల్, నారాయణపేట్, సిద్ధిపేట, వనపర్తి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్,దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురిలో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట వర్షం దంచి కొట్టింది. నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసింది. పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
షేక్ పేటలో 54 మిల్లిమీటర్లు, ఖైరతాబాద్ లో 53, శేరిలింగంపల్లిలో 52, బాలనగర్ 44, కుత్బుల్లాపూర్ 40, గోల్కొండలో 35 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది.భారీ వర్షాలతో రోడ్లలన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపుతున్నారు.












Click it and Unblock the Notifications