weather alert: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంంది.

తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉండటంతో అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ తావరణ కేంద్రం తెలిపింది.

weather update: next 4 days heavy rains in telangana state

మరోవైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం నుంచి మరో మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Recommended Video

    Why Ashada Masam Considered Inauspicious ? | Oneindia Telugu

    పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీంఅసిఫాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+