హైదరాబాద్‌ను వదలని వాన: 5 రోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే.. మూడు రోజుల నుంచి మూసురేసింది. దీంతో జనం బయటికి వెళ్లలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి, రోడ్లపైకి వరద నీరు చేరుకుంటుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. గురువారం కూడా వర్షం ఎడతెరిపిలేకుండా పడుతోంది.
తాజాగా, రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రానున్న రెండు రోజుల్లో కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. మరోవైపు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Telangana: Traffic jam witnessed in Hyderabad after rain lashed the city. pic.twitter.com/GsOIyngwfB
— ANI (@ANI) July 20, 2023
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోడ్లపైకి వరదనీరు భారీగా చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి ప్రాణ నష్టాన్ని జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications