హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Alert: హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వరదనీరు అనేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇటీవల భారీ వర్షాలు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. మరో నాలుగు రోజులు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలంలో అత్యధికంగా 21 సెంటిమీటర్లు, జనగామ జిల్లా దేవరుప్పులలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జనగామ బస్టాండ్‌​తో పాటు జనగామ-హైదరాబాద్ రహదారి పూర్తిగా జలమయమైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దముప్పారం-దంతాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మరికొంట్ల పెద్ద చెరువు అలుగుపారడంతో.. రేపోని, జాలుబావుల, లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ముప్పారం శివారులో వరదలో తొర్రూరుకు చెందిన నలంద పాఠశాల బస్సు చిక్కుకోగా.. అందులో ఉన్న విద్యార్థులను స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు మరోసారి పోటెత్తుతున్న వరద

మరోవైపు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, చెక్​డ్యాములు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని లెండి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలంలో నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జుక్కల్ మండలం బాబాల్​గావ్, సవాల్​గావ్ ప్రాంతాలకు రవాణా స్తంభించింది.

నాగిరెడ్డిపేట్​లో అత్యధికంగా 15 సెంటీమీటర్లు, నిజాంసాగర్​లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కౌలాస్ నాలా, పోచారం ప్రాజెక్టులకు మరోసారి వరద వచ్చి చేరుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. భారీగా వరదనీరు వస్తుండటంతో కిందికి విడుదల చేస్తున్నారు.

మరో నాల్గు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఇది ఇలావుండగా, ప్రజలు రానున్న ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్​ హైదరాబాద్​ సహా మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. భారీ వర్షాలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాఠోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

English summary
Weather update: next four days heavy to very heavy rains hyderabad and other telangana districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X