తెలంగాణ ప్రజలకు వాతావరణ హెచ్చరిక

తెలంగాణలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో బయటతిరిగే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా, మరోసారి ఎండ తీవ్రత, వడగాలుల హెచ్చరికలు చేశారు.

తెలంగాణలో రానున్న మడు నాలుగు రోజుల పాటు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

Weather update next four days high temperature in telangana districts

గురువారంనాడు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని
వాతావరణ శాఖ తెలిపింది.

శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+