హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు

హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నా.. సాయంత్రం భారీ ఈదురుగాలులతో పాటురు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ నగర శివార్లలో పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉప్పల్, చిలుకానగర్, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, కీసర, కొంపల్లి, చర్లపల్లి, కాప్రా, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

జవహర్ నగర్, నేరేడ్ మెట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం వాన పడింది. హైదరాబాద్ నగరంలోని మిగితా ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. అయితే, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రం మాత్రం కాస్త వానలు పడి, ఉక్కపోత పెరుగుతుందని వెల్లడించింది.

weather update Rain in Hyderabad city

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ‌లో శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. కొన్ని జిల్లాల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 2 నుంచి 3 డిగ్రీల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్లడించింది. రాగ‌ల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

శ‌నివారం ఉరుములు, మెరుపుల‌తో పాటు గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. గురువారం మ‌న్నార్ గల్ఫ్ నుఎంచి ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కు స‌గ‌టు స‌ముద్ర మ‌ట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొన‌సాగిన ద్రోణి.. గురువారం కోమ‌రిన్ ప్రాంతం నుంచి అంత‌ర్గ‌త త‌మిళ‌నాడు, రాయ‌లసీమ మీదుగా ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కు స‌గ‌టు స‌ముద్ర మ‌ట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొన‌సాగుతోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+