తెలంగాణలో మరో 3-4 రోజులపాటు అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో, రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్: వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఆది, సోమ వారాల్లో కాస్త విశ్రాంతినిచ్చాయి. అయితే, రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలంగాణను అలర్ట్ చేసింది.

ఇప్పటికే కురిసన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Weather update: Red alert issued for Telangana as heavy rainfall likely to occur

రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజులు విస్తారంగా వర్షాలకు అవకాశం ఉంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

Weather update: Red alert issued for Telangana as heavy rainfall likely to occur

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో జల కళను సంతరించుకున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో పలు జలపాతలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయ. తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధమనోహరంగా మారింది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు.

వరంగల్‌కి 133 కిలోమీటర్ల దూరంలో సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలిస్తున్నారు. ఆదివారం సెలవురోజు కావటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. కొండల పై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార పర్యాటకులకు కనులవిందు చేస్తోంది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి బొగత సహజ అందాలను ఆస్వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+