తీహార్ క్లబ్ కు వారికి స్వాగతం: కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు. బీహార్ జైలు నుంచి లేఖ రాసిన సుకేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంతకాలం తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిందని, నిజం బయటకు వచ్చిందని, చేసిన పనులు కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో వెల్లడించారు. లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైందని, మీకు కూడా తీహార్ జైలు కౌంట్ డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యలు చేశారు. ఇక నిజం శక్తి ఏంటో తెలుసుకుని విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకునేవాళ్లు భారతదేశంలో చట్టం అన్నింటికన్నా శక్తివంతమైనదని గుర్తించాలన్నారు. తాను గతంలో రాసిన లేఖలలో రెండు అంశాలను పొందుపరచానని పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవుతుందని చెప్పానని, రెండవది తీహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంటర్ మొదలైందని చెప్పానని.. ఈ రెండు ఇప్పుడు నిజమైనట్టు గా అనిపిస్తున్నాయి అన్నారు.
కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయిందని, కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు అన్ని బయటపడతాయని సుకేష్ చంద్రశేఖర్ వెల్లడించారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు ఈడీ విచారణలో బయటికొస్తాయి. ఇది ఎవరికి అర్థంకావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు.
అక్కా!..నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా అంటూ కవితకు సెటైర్లు వేశారు. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు అంటూ సుకేష్ చంద్రశేఖర్ కవితకు సూచించారు.

ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈడీ, సీబీఐ కన్‌ఫ్రంటేషన్ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్కా.. మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మీ మరో సోదరుడు, అవితిని సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్‌లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారని పేర్కొన్నారు .
లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదల్చుకున్నా. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుందని సుకేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేజ్రీవాల్ గారికి.. నా సోదరసోదరీమణులకు తీహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నానని సుకేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా సెన్సేషన్ సృష్టించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications