షాకింగ్: అర్దరాత్రి స్మశానంలో అఘోరీ హిజ్రాలతో కలిసి..!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఎక్కడికి వెళ్లినా అక్కడ హల్చల్ చేస్తున్నారు. స్థానికులతో పాటు పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక తాజాగా నిన్న వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్ కు చేరుకున్న అఘోరి ఏమి హల్చల్ చేస్తుందోనని పోలీసులు భయపడ్డారు.
ఓరుగల్లు వాసులను వణికించిన అఘోరీ
అఘోరీ నాగ సాధు ప్రతి కదలికను ఓ కంట కనిపెట్టారు. ఇక సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసి వెళ్లే వరకు అఘోరిపై ఆందోళనలో ఉన్న పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిన్న రాత్రి అఘోరీ చేసిన పని ఓరుగల్లు వాసులకు భయం పుట్టించింది. నిన్న రాత్రి స్మశానంలో లేడీ అఘోరి హల్చల్ చేసింది.

స్మశానంలో అఘోరీని కలిసిన హిజ్రాలు
వరంగల్లోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రాత్రివేళ పూజలు చేసిన అఘోరి శరీరానికి చితిలోని బూడిదను పూసుకొని ఆరిపోయిన చితి పైన పడుకుంది. దీంతో అఘోరిస్మశానంలో పూజలు చేస్తుందని తెలిసిన స్థానికులు తీవ్రభయాందోళనలకు గురయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న హిజ్రాలు నిన్న అర్ధరాత్రి అఘోరీని కలవడానికి స్మశానానికి వెళ్లారు. అఘోరి నాగసాధు కూడా ఒక హిజ్రా కావడంతో హిజ్రాలు తన మానసిక స్థితిని తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్లారు.
అఘోరీ నాగసాధును ప్రశ్నించిన హిజ్రాలు
పబ్లిక్ ప్రదేశాలలో తిరగడం తప్పని చెప్పే ప్రయత్నం చేశారు. పబ్లిక్ ప్రదేశాలలో ఎందుకు తిరుగుతున్నావని అర్ధరాత్రి స్మశానానికి వెళ్లిన హిజ్రాలు అఘోరి నాగసాధును ప్రశ్నించారు . పర్యటనల పేరుతో ప్రజలలోకి రావడం మంచిది కాదని దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అంటూ ప్రశ్నించారు.
అఘోరి నాగసాధు మానసిక స్థితి తెలుసుకునే యత్నం
హిజ్రాల సంఘం నాయకురాలు లైలా అఘోరి నాగసాధు మానసిక స్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా సరిగ్గా సమాధానం చెప్పకుండా తాను ఏమీ మాట్లాడలేనని అఘోరీ చెప్పారు. అంతేకాదు శరీరానికి బూడిద పూసుకుని ఆరిపోయిన చితిపై పడుకుని రాత్రంతా స్మశానం లోనే ఉన్నారు.
హారర్ సినిమాలా చితిపై త్రిశూలాలతో అఘోరీ హల్చల్
అంతేకాదు ఒక హారర్ సినిమాని తలపించే విధంగా ఆరిపోయిన చితిపైన త్రిశూలాలు ఏర్పాటు చేసి ఆ త్రిశూలాల మధ్యలో కూర్చొని తన వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రి తో, కోడితో పూజలు చేశారు. కోడిని బలిచ్చి రక్త తర్పణం చేశారు. ఆ తర్వాత గుమ్మడికాయ కోసి ఆ గుమ్మడికాయకు గంటకు పైగా పూజలు చేశారు. దీంతో అఘోరి నాగసాధు చేస్తున్న పనికి స్థానికులు వణికిపోయారు.












Click it and Unblock the Notifications