అన్ని సర్టిఫికెట్లు, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు ఒకే చోట- ఇలా చేస్తే చాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సేవలను మరింత వేగంగా.. సౌకర్య వంతంగా తీర్చి దిద్దేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా వాట్సప్ మీ - సేవ విధానం ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీంతో, రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సర్వీసులను ప్రారంభించేందుకు సిద్దమైంది. ముఖ్యమైన హెల్ప్ లైన్లను అనుసంధానం చేయటం ద్వారా ఏ సందర్భంలో అయినా ఉపయోగపడేలా తాజా మార్పులతో అప్ గ్రేడ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ మీ - సేవ విధానంలో కొత్త మార్పులు ప్రవేశ పెడుతోంది. 108, 102, 101, గ్యాస్ సిలిండర్ బుకింగ్ తదితర ముఖ్యమైన హెల్ప్ లైన్ నంబర్లన్నింటినీ లింక్ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో లబ్దిదారులు డిజిటల్ సర్వీసులు అందుకున్నారు. దీని ద్వారా గతంలో వలే మీ-సేవ కేంద్రాల ఎదుట క్యూ కట్టే అవసరం లేకుండా సేవలను ప్రజల వద్దకే తీసుకొచ్చింది. మొత్తం పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. 80969 58096 వాట్సప్ నంబర్ ద్వారా నిర్విరామంగా 24 గంటలూ పౌర సేవలు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మెసేజ్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన పూర్తి సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. వాట్సప్ వినియోగం పైన అవగాహన లేని వారికి సులభంగా అర్దమయ్యే విధంగా రూపకల్పన చేసారు. రాష్ట్రంలోని 31 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన దర్శనం.. వసతి సేవలు సైతం ఇందులో అందుబాటు లోకి తీసుకొచ్చారు.

మరిన్ని సేవలు అందుబాటులోకి
ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ మీ -సేవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపుగా 80 వేల మందికి పైగా సేవలు పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల లావాదేవీలు నమోదైనట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ల స్టేటస్, తాజా అప్‌డేట్స్ కూడా వాట్సప్‌లోనే తెలుసుకోవటం, ఆమోదం పొందిన సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో లబ్ది దారులకు ప్రయోజనకరంగా మారుతోంది. త్వరలో అత్యవసర సేవల నంబర్లను కూడా వాట్సప్ మీ-సేవకు అనుసంధానం చేయటం ద్వారా మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఈ సదుపాయం వినియోగం ద్వారా దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు వెంటనే తెలిసిపోతాయి. సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ సిద్ధం కాగానే దాని డౌన్‌లోడ్ లింక్ నేరుగా వాట్సప్‌కే వస్తుంది. ఆ తర్వాత మనుకు డౌన్‌లోడ్ అవుతుంది. దీంతో.. కొత్తగా ప్రవేశ పెడుతన్న ఎమర్జెన్సీ సేవల ద్వారా వినియోగదారులకు సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
-
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications