వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజీ..వాజీ.. వాజీ..! ఆపరేషన్ గరుడ ఎటుపాయె శివాజీ..??

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదా గురించి కొన్ని రోజులు ప్రత్యేక ఉద్యమం చేసిన హీరో శివాజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గరుడ శివాజీగా గుర్తింపు తెచ్చుకున్నారు. గరుడ పురాణంతో అప్పట్లో తెలుగు రాజకీయాలతో సంచలనం సృష్టించిన తెలుగు నటుడు శివాజీ, తాజాగా టివి 9 వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మరీ ఇప్పుడు అసలు గరుడ పురాణం సంగతి ఏమయినట్లు..ఈ గరుడ పురాణ శివాజీ ఎటు వెళ్ళినట్లు?

పోలీసుల వలలో చిక్కకుండా దేశం దాటేసారా ? లేక వేషాలు మార్చి ఇక్కడిక్కడే తిరుగుతున్నారా..అనే అనుమానాలు శివాజీ కోసం తీవ్రంగా గాలిస్తున్నతెలంగాణ పోలీసులకు తలెత్తుతున్నాయి. అటు తెలంగాణ, ఇటూ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండటంతో ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన శివాజీ కి దాచుకోవడానికి ఇప్పుడు షెల్టర్ ఇచ్చేవారు సైతం కరువయ్యారు.

where is operation garuda Shivaji..?

తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శివాజీ కదలికలు కనిపెడుతూ ఉండటంతో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ లకు వాడకానికి దూరంగా శివాజీ ఉన్నట్లు చెబుతున్నారు. తనపై కేసులు నమోదు అయ్యాక తప్పించుకునేందుకే గరుడ శివాజీ గుండు గీయించుకున్నట్లు తెలుస్తుంది. రకరకాల విగ్గులతో వేషాలు మారుస్తూ ఉండేందుకే బోడిగుండు అంత ఉత్తమం లేదన్న అంచనాతో శివాజీ ఈ పని చేసినట్లు గా పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ మారువేషం లోనే శ్రీలంక సముద్ర మార్గాన చెక్కేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ అయినందున శ్రీలంక నుంచి అమెరికా ఇతర దేశాలకు ఉడాయించి ఉండొచ్చని నిఘా విభాగం భావిస్తుంది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ పోలీసుల ముందు మూడు సార్లు హాజరయ్యారు. ఈ కేసులో రవి ప్రకాష్ కు శిక్ష తప్పకపోతే , శివాజీ పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Telugu actor Shivaji, who has created sensation with Telugu politics with Garuda Purana, was caught on the latest TV9 controversy. Now this Garuda mythological Shivaji went to where ? Did he crossed the country into the trap of the police?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X