రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరో
తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్రాన్ని నడిపే బాధ్యతను కూడా అధిష్టానం ఆయనకే అప్పజెప్పింది. సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అవుతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో ఓ హీరో అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎవరోకాదు.. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ
కృష్ణకు రేవంత్ రెడ్డి వీరాభిమాని. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రేవంత్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ పేరు మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా మార్మోగుతుంది. ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన విషయాలే వైరలవుతున్నాయి.

రేవంత్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్ పటేల్‌గా వ్యవహరించేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. వనపర్తిలోని జడ్పీ బాలుర పాఠశాలలో రేవంత్ హైస్కూల్ విద్య కొనసాగింది. 1983-1985లో వనపర్తిలోనే ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభించారు. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా ఉండేవారు. 2004లో కొంతకాలం భారత రాష్ట్ర సమితిలో పనిచేశారు. 2009లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్ రెడ్డిని ఓడించారు. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ గెలుపు తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మనువాడారు. స్థిరాస్తి వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications