తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు? హాట్ డిబేట్!!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికల శంఖారావం పూరించనుంది ఎన్నికల కమిషన్. కొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతూ ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో గులాబీ పార్టీ విజయఢంకా మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా మళ్లీ ఎన్నికలలో విజయ బావుటా ఎగురవేసి మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది.

గులాబీ బాస్ కెసిఆర్ ఈమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల సన్నాహాల్లో పడ్డారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్, బిజెపి రెండూ ఉన్నాయి.

 trs

దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనూ బిజెపి అభ్యర్థులు విజయం సాధించడంతో తెలంగాణ లో కెసిఆర్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పే ప్రయత్నం చేసారు బిజెపి నేతలు. ఇక ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి ఓటమి పాలు కావడంతో బిజెపి డల్ అయింది.

అయితే తాజాగా కర్ణాటక ఎన్నికలు రావడంతో అక్కడ విజయం సాధిస్తే తెలంగాణలో పట్టు దొరుకుతుందని బిజెపి నేతలు భావించినప్పటికీ, కర్ణాటకలో ప్రజలు బీజేపీని చావు దెబ్బ కొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఊహించని విధంగా బిజెపికి దెబ్బ తగిలింది. ఈ సమయంలో బిజెపి తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మేమే అని చెప్పుకోవడానికి మరో ప్లాన్ చేసింది.

 trs

అందులో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, కర్ణాటక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ ఆర్థిక వనరులు సమకూర్చారని ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉంది తామేనని చెబుతుంది బిజెపి. ఇలా ఉంటే కర్ణాటకలో విజయం సాధించిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉంది తామేనని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని పదేపదే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్న ప్రజలు బీఆర్ఎస్ ను ఏ పార్టీ బలంగా ఢీ కొడుతుంది? ఏ పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తుంది? అన్న విషయాలను చర్చిస్తున్నారు. ఆయా పార్టీలకు ఉన్న బలాలు, బలహీనతలపైన, అభ్యర్థులపైన తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+