హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అకున్‌పై ఒత్తిడి తెచ్చిన ఆ ప్రముఖులెవరు: జాబితాలో పేర్లు మారాయా?

డ్రగ్స్ కేసులో ఉన్న ప్రముఖుల పేర్లను వెల్లడించకుండా ఉండాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌పై ఎవరు ఒత్తిడి తెచ్చారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఉన్న ప్రముఖుల పేర్లను వెల్లడించకుండా ఉండాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌పై ఎవరు ఒత్తిడి తెచ్చారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వెయ్యిమందికి నోటీసులు, ఆ పేర్లు బయటపెట్టొద్దని ఒత్తిడి: అకున్ సభర్వాల్వెయ్యిమందికి నోటీసులు, ఆ పేర్లు బయటపెట్టొద్దని ఒత్తిడి: అకున్ సభర్వాల్

అయితే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం కూడ ఈ మేరకు సానుకూలంగా ఉందనే సంకేతాలను ఇచ్చింది. అయితే ఈ కేసులో ఇన్‌వాల్వ్ అయిన కొందరి ప్రముఖుల పేర్లను బయటకు వెల్లడించకుండా ఉండాలని ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడులున్నాయి.

డ్రగ్స్‌ కేసు: టాలీవుడ్‌కు చెందిన ఇద్దరి కీలక సమాచారం, ఎవరా ఇద్దరు?డ్రగ్స్‌ కేసు: టాలీవుడ్‌కు చెందిన ఇద్దరి కీలక సమాచారం, ఎవరా ఇద్దరు?

డ్రగ్స్ కేసులో ఇంకా కొంతమంది సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు పిల్లలు ఉన్నారని, వారి పేర్లను వెల్లడించకూడదని ఒత్తిడి ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ప్రకటించారు.

సభర్వాల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు వారు తమ పేర్లను బయటకు రాకుండా అడ్డుకొంటున్నారనే విషయాలపై చర్చ సాగుతోంది. అయితే ఈ కేసులో ఏ ఒక్కరిని వదలబోమని ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు. అయితే అదే సమయంలో అకున్ సభర్వాల్ చేసిన ప్రకటన మాత్రం ఈ కేసు వెనుక తీవ్ర ఒత్తిడులు ఉన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఎవరా పెద్దలు?

ఎవరా పెద్దలు?

డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న కొందరి ప్రముఖులను విచారణ సందర్భంగా సిట్ అధికారులు గుర్తించారు ఇప్పటికే అరెస్టుచేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు విచారణ సందర్భంగా అందిన సమాచారం ఆధారంగా మరికొందరి పేర్లు కూడ బయటకు వచ్చాయని గుర్తించారు.అయితే ప్రముఖులను పేర్లను గుర్తించిన సిట్ అదికారులు వారికి నోటీసులు పంపి విచారించాలని భావిస్తున్నారు. అయితే అదే తరుణంలో వారి పేర్లను బయట పెట్టకుండా ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులపై తీవ్రమైన ఒత్తిడులు వస్తున్నాయి. ఈ విషయాన్ని అకున్ సభర్వాల్ ప్రకటించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పేర్లను బయటపెట్టకుండా ఒత్తిడి తెస్తోంది ఎవరనే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు మాత్రం బయటపెట్టలేదు. అయితే సినీ ప్రముఖులా, వ్యాపారులా, ఉన్నతాధికారుల నుండి ఈ ఒత్తిడులు వస్తున్నాయా అనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.

Recommended Video

Tollywood Drugs Scandal : Top Hero And Heroine To Be Arrest - Oneindia Telugu
రెండో జాబితాలో వారి పేర్లు ఉంటాయా?

రెండో జాబితాలో వారి పేర్లు ఉంటాయా?

డ్రగ్స్ కేసుకు సంబంధించి రెండో జాబితాలోనైనా ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయా రావా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొదటి జాబితాలోనే కొందరు ప్రముఖుల పేర్లను వదిలేశారనే ప్రచారం కూడ ఉంది. మొదటి జాబితాలో చోటుచేసుకోని పేర్లకు రెండో జాబితాలోనైనా చోటు దక్కుతోందా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది.

మంత్రులున్నా కేసులు పెట్టాలన్నారు

మంత్రులున్నా కేసులు పెట్టాలన్నారు

డ్రగ్స్ కేసులో ఎంతటివారున్నా వదలబోమని అధికార టిఆర్ఎస్ నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ కేసులో క్యాబినెట్ మంత్రులున్నా వదలబోమని ప్రభుత్వం నుండి గతంలో ప్రకటనలు వచ్చాయి.అయితే ఆచరణలో మాత్రం అందుకు విరుద్దంగా సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా అకున్ సభర్వాల్ చేసిన ప్రకటనను ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల పేర్లను తొలి జాబితా నుండి తప్పించారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఐటీ నిపుణుల ఇళ్ళ వద్దకు వెళ్ళి కౌన్సిలింగ్

ఐటీ నిపుణుల ఇళ్ళ వద్దకు వెళ్ళి కౌన్సిలింగ్

అయితే నగరంలోని పలు ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు డ్రగ్స్ తీసుకొంటున్న విషయాన్ని సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఏ ఏ సంస్థలకు చెందిన ఉద్యోగులు డ్రగ్స్ తీసుకొంటున్నారనే విషయమై గుర్తించిన సిట్ అధికారులు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు అయితే ఈ నోటీసుల ఆధారంగా ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను గుర్తించి వారి ఇళ్ళకు వెళ్ళి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఓ ఉన్నతాధికారి విచారణ అధికారులకు సూచించారు. లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.

English summary
Who pressured on Excise enforcement director Akun sabharwal.He stated that somepersons put pressure on me for don't reveal names in the drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X