మరో మహిళతో భర్త అక్రమ సంబంధం: ఇద్దరు మహిళల సిగపట్లు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చంద్రబాబునగర్‌లో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త యాదగిరి ఇంటి ఎదుట మొదటి భార్య మంగళవారం ధర్నాకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి.
ఈ సమయంలో యాదగిరి భార్యలు ఘర్షణ పడ్డారు. దాంతో అక్కడ ఉధృక్తతకు దారి తీసింది. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదగిరి మొదటి భార్య నుంచి దూరంగా ఉంటూ రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య, ఆమె పిల్లలు మంగళవారం చంద్రబాబు నగర్‌కు వచ్చి రెండో భార్య ఇంటి ముందు ధర్నాకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇరు వార్గల మధ్య గొడవ జరిగి పరస్పరం కొట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గొడవ పడుతున్న మహిళలను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications