కేసీఆర్‌ను ఓడిస్తా! చిల్లరగా మాట్లాడారు: బుల్లెట్ లాంటోన్నంటూ ఈటల రాజేందర్ నిప్పులు

హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని దుయ్యబట్టారు బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్.ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కు ఈడ్చుకొచ్చామని చెప్పారు.

కేసీఆర్ చిల్లరగా మాట్లాడారంటూ ఈటల ఫైర్

కేసీఆర్ చిల్లరగా మాట్లాడారంటూ ఈటల ఫైర్

కేసీఆర్‌కు కావాల్సింది బానిసలని.. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు పంపారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో పురుష పదజాలాలు ఏనాడు లేవని.. తన గురించి కేసీఆర్ చిల్లరగా మాట్లాడారని మండిపడ్డారు. తనకు సహనం, సంస్కారం, ఓపిక ఉందన్నారు. డబ్బుతో గెలవొచ్చనే భ్రమలో కేసీఆర్ ఉన్నారన్నారు.

బెంజి కార్లలో తిరిగేవారికి రైతుబంధు ఎందుకని ప్రశ్నించా: ఈటల

బెంజి కార్లలో తిరిగేవారికి రైతుబంధు ఎందుకని ప్రశ్నించా: ఈటల

ధనవంతులకు, బెంచ్ కార్లలో తిరిగేవారికి రైతుబంధు ఎందుకని తాను ప్రశ్నించానని.. ఈ విషయం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పామని ఈటల రాజేందర్ తెలిపారు. తాము ఉద్యమకారులమని, బానిసలం కాదన్నారు. ఎప్పుడూ భయపడి వెనుకడుగు వేయబోనన్నారు. తప్పులను ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఈటల తెలిపారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడలేదని, వారే బయటికి పంపించారన్నారు.

కేసీఆర్ ఓడిస్తే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఈటల నిప్పులు

కేసీఆర్ ఓడిస్తే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఈటల నిప్పులు

కేసీఆర్‌ను ఓడిస్తేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందన్నారు ఈటల. కేసీఆర్ కు విసిరిన చాలెంజ్ కు తాను కట్టుబడి ఉన్నానన్నారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని.. నాయకులు కాదని ఈటల స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బీజేపీ సిద్ధంగా ఉందని ఈటల చెప్పారు.

బుల్లెట్ లాంటోడ్ని.. కేసీఆర్ బలహీనతలూ తెలుసంటూ ఈటల

బుల్లెట్ లాంటోడ్ని.. కేసీఆర్ బలహీనతలూ తెలుసంటూ ఈటల

కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టేది తానేనని ఈటల స్పష్టం చేశారు. మొకాలంతోన్నే కావొచ్చు.. మోకాలంతే ఉండొచ్చని.. చిన్నోన్నే కావొచ్చు కానీ.. తాను బుల్లెట్ లాంటోన్నీ అని ఈటల వ్యాఖ్యానించారు. బుల్లెట్ కూడా ఇంచంతే ఉంటుందని.. దించితే గుండెల్లోకి వెళ్తుందని కేసీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. హుజూరాబాద్​లో తనను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని.. ఓటుకు నోటు ఇచ్చారన్నారు. కేసీఆర్‌ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్‌ బలం, బలహీనతలు, భయం అన్నీ తనకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+