Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా? అంటూ కేటీఆర్, పాదయాత్రకు రెడీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నవారు. సూర్యాపేట జిల్లా వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారమే లక్ష్యంగా తాను పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర కొనసాగుతుందన్నారు. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Will do a state-wide padayatra next year KTR

అంతకుముందు నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదన్నారు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదామని అన్నారు.

తెలంగాణ ధనం అంతా రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ ఖాతాలో పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్గొండను నెంబర్ వన్ చేసింది కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులేనని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిందని అన్నారు. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదని అన్నారు. ఏం మాట్లాడకముందే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు.

ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసం. చరిత్రలో ఒక అనివార్యమైన సందర్భంలో బీఆర్ఎస్ పుట్టింది కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నాం. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ పీడ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఫీనిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరాడుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ముఖ్యమంత్రి రేవంత్ ది ఒక వికృతమైన మనస్తత్వం అని కేటీఆర్ విమర్శించారు.

చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు ఏం లేదు. యూట్యూబ్‌ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడు అని కేటీఆర్ మండిపడ్డారు.

కేసీఆర్ ముందే ఆ విషయం చెప్పారు

100కు 100% రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయి. కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతుబంధుకి రామ్ రామ్ అయితదని కేసీఆర్ ముందే చెప్పారని కేటీఆర్ తెలిపారు.

నీళ్ల మంత్రి , నల్లగొండలోని ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారు. అధికారం మాత్రమే పోయింది ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చింది అని విమర్శించారు కేటీఆర్.

కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ కట్టిన కాలేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలి. కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలి అని కేటీఆర్ అన్నారు. జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారన్నారు.

మజ్లిస్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదా?

స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవు. స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవం. ప్రసాద్ కుమార్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉంది. శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే.. గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ? అని కేటీఆర్ నిలదీశారు.

వరంగల్ సభకు ప్రతి గ్రామం నుంచీ తరలిరావాలి

పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గులాబీ దండు మాత్రమే. ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి. వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకొందామని బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పారు.

కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తాం. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలి అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడిలాగా విజృంభించాలి. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలి. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+