Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి చెప్పిన మాట, అజ్ఞాతవాసి డైలాగ్: ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 లో తెలుగుదేశం పార్టీతో జత కలుస్తారా? బీజేపీ - టీడీపీ కలిసి ముందుకు సాగితే వారితో కలిసి నడుస్తారా? అనే సస్పెన్స్ సర్వత్రా కొనసాగుతోంది. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో పవన్ బీజేపీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు.

ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు బీజేపీని వదులుకోవద్దని, పవన్‌తో దోస్తీని దూరం చేసుకోవద్దని కోరుకుంటున్నారు. కానీ బీజేపీ - పవన్ కళ్యాణ్‌లు కలిసే పరిస్థితులు ఎంతమాత్రమూ లేవు. పైగా ఇటీవల సీపీఐ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.

Recommended Video

    Pawan Kalyan Speech over Chiranjeevi's CM post
     ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాల

    ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాల

    మరోవైపు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై కూడా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏయే పార్టీలు కలుస్తాయి, ఎలా ముందుకు వెళ్తాయి అనేది ఆసక్తికరంగా మారుతోంది. పైగా పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది.

    బీజేపీకి చంద్రబాబు దూరం జరిగే అవకాశం

    బీజేపీకి చంద్రబాబు దూరం జరిగే అవకాశం

    విభజన హామీల విషయంలో చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కేంద్రంపై అసంతృప్తి ఉంది. ప్రస్తుతానికి కేంద్రం అవసరం నవ్యాంధ్రకు ఉందని భావిస్తున్న చంద్రబాబు మౌనంగా ముందుకు సాగుతున్నారు. 2019లో కేంద్రంలో బీజేపీ గెలుపు అటు ఇటు అవుతుందని తెలిసినా లేదా విభజన హామీల విషయంలో బీజేపీ అమలు చేయడం లేదని ఏపీ ప్రజల్లో ఆగ్రహం ఉందని తెలిసినా చంద్రబాబు దూరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

     జగన్ బీజేపీ దరి చేరాలన్నా

    జగన్ బీజేపీ దరి చేరాలన్నా

    నిజంగానే టీడీపీ - బీజేపీ దూరం జరిగితే చంద్రబాబు - పవన్ కళ్యాణ్‌కు లెఫ్ట్ పార్టీలు జతకలిసే అవకాశాలను కొట్టి పారేసే పరిస్థితులు లేవని చెబుతున్నారు. మరోవైపు, ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ కూడా బీజేపీతో కలిసే అవకాశాలు ఉండవని అంటున్నారు. అయితే ఇవన్నీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తుందా, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని బట్టి ఆధారపడి ఉందని చెబుతున్నారు.

     అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా

    అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా

    ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పవన్ గురించి ఆసక్తికర డైలాగ్ ఉంది. అతను మళ్లీ సైకిల్ ఎక్కుతాడా అనే డైలాగ్ చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయాలకు అనువదించుకున్నా.. అనువదించుకోకపోయినా.. విభజన హామీలు నెరవేర్చకుంటే టీడీపీ - బీజేపీలు కలిసే అవకాశాలు లేవని, పరిణామాలు అనూహ్యంగా మారుతాయా అనే చర్చ సాగుతోంది.

     చిరంజీవి మాట, అజ్ఞాతవాసి డైలాగ్, పవన్ తీరు

    చిరంజీవి మాట, అజ్ఞాతవాసి డైలాగ్, పవన్ తీరు

    మొన్న చిరంజీవి తన సన్నిహితుల వద్ద ఓ మాట చెబుతున్నట్లుగా ప్రచారం సాగింది. నిన్న అజ్ఞాతవాసిలో డైలాగ్‌ను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు ఉండే అవకాశాలే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తీరు కూడా బాబుకు అనుకూలంగా ఉందని అంటారు. 2019లో తన తమ్ముడు.. చంద్రబాబు వైపే ఉంటారని చిరంజీవి సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా ప్రచారం సాగింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+