ఆయన లేక పోతే బువ్వ లేదు,బట్ట లేదు!సారే కావాలి,కారే రావాలి.!మునుగోడులో ఎర్రబెల్లితో వృద్దిడి వింత సంభాషణ!
మునుగోడు/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏ వింత సంభాషణ, సంఘటన జరిగినా అది రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తోనే మొదలవుతుంది. గతంలో ప్రభుత్వ మహిళా అదికారిని బాగా ఊపుతున్నావంటూ వార్తల్లో నిలిచిన ఎర్రబెల్లి తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కూడా సంచలనాలు నమొదు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 3వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇక్కడే ఓ వృద్దిడికి ఎర్రబెల్లికి మద్య ఓ ఆసక్తిక అంశం చోటుచేసుకుంది.

మునుగోడు ప్రచారంలో ఎర్రబెల్లి..
మునుగోడు నియోజక వర్గంలో 2వ, 3వ వార్డుల ఇంచార్జీగా, ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహరిస్తున్న అంశం తెలిసిందే. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆరెఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థింస్తున్నారు. ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రచారంలో భాగంగా అన్ని వయసుల వారిని సరదాగా పలకరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పనితనం గురించి వాకబు చేస్తూ ముందుకు కదులుతున్నారు మంత్రి ఎర్రబెల్లి.

ఆయన లేక పోతే బువ్వ లేదు. బట్ట లేదు..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు ప్రచారంలో ఉదృతంగా పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో ఓ వృద్ధుడి జరిపిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఇదే అంశం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఎర్రబెల్లికి అరుదైన అనుభవం..
ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీలో 2,3 వార్డుల ఇంచార్జీ గా ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మంగళవారం 3 వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రి ని సైతం అబ్బుర పరిచేలా మాట్లాడారు. వృద్దుడు మాట్లడిన తీరు మంత్రి ఎర్రబెల్లిని తన్మయత్వానికి గురిచేసి నట్టు ఎర్రబెల్లి అనుచరులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ వాతావరణంలో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయని తెలంగాణ నాయకులు మురిసిపోతున్నారు.

కేసీఆర్ లాంటి మొనగాడు లేడు..
మునుగోడు ఓటర్ల మనోగతాన్ని ఓ వృద్దుడు మంత్రి ఎర్రబెల్లితో ముక్కు సూటిగా చెప్పారు. సారే కావాలి, కారే రావాలి, ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు! అని ఓ వృద్దుడు మంత్రి ఎర్రబెల్లితో సంభాషించాడు. 60, 70 ఏండ్ల నుంచి సీఎం చంద్రశేఖర్ రావు లాగా చేసిన మొనగాడే లేడని, ఆయన పోయిన తెల్లారి బువ్వ దొరకదని ఆ వృద్దుడు స్పష్టం చేసాడు.అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావే రావాలని నోటి ప్రచారం చిర్వహిస్తున్నట్టు వృద్దుడు తెలిపాడు. సీఎం చంద్రశేఖర్ రావు ఉంటేనే అన్ని వసతులు ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వృద్దుడు తెలిపాడు. వృద్దిడి మాటలకు మంత్రి ఎర్రబెల్లి ముచ్చటపడ్డట్టు చర్చ జరుగుతోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications